Share News

వంద రోజుల్లో నాలుగు గ్యారెంటీల అమలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:10 PM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా వంద రోజుల్లో నాలుగు గ్యారెంటీలను అమలు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.

వంద రోజుల్లో నాలుగు గ్యారెంటీల అమలు
మదనాపురంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

మదనాపురం, మార్చి 11: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా వంద రోజుల్లో నాలుగు గ్యారెంటీలను అమలు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ గ్రామా లకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం జీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి అవినీతికి తెరలేపిందని, ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులను సంపాదించారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో ఆత్మ హత్యలు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గురుకుల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా డీఎస్సీ నోటిషికేషన్‌ కూడా వేశామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అభివృద్దిని చూసి అనేక మంది పార్టీలో చేరుతున్నారని అన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి అక్కడి సమస్యలను ఎస్‌వో రేణుకను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, నాయకులు ప్రశాంత్‌, జగదీష్‌, రామకృష్ణ, మహేష్‌కుమార్‌, కృష్ణవర్ధన్‌రెడ్డి, వడ్డెకృష్ణ, బాల స్వామి, రాములు, నాగశేషు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 11:10 PM