ఇష్టపడి చదివితేనే లక్ష్యసాధన
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:30 PM
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు.

- జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత
- విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
గద్వాల టౌన్/ మల్దకల్, జూన్ 12 : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా బుధ వారం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్న త పాఠశాలలో విద్యార్థులకు మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ప్రధానోపాధ్యాయుడు ఇమ్మాన్యుయేల్, ఉపా ధ్యాయులు గోపీనాథ్, రేణుకాదేవి, ఫయాజ్ పాల్గొ న్నారు. పట్టణంలోని సుంకులమ్మ మెట్టు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీఈవో ఏ. ఇందిర యూనిఫాంలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ డి.శంకర్‌సింగ్, ఎంఈవో సురేష్, ఏవో హంపయ్య పాల్గొన్నారు. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి ఇందిర అన్నారు. మల్దకల్ మండలంలోని అమరవాయిలో జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేశ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాల్సిన బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులదేనన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కాంతమ్మ, ఎంఈవో సురేష్, ఏఏపీసీ చైర్‌పర్సన్ సుజాత, హెచ్‌ఎం విజయలక్ష్మీ, ఉపాధ్యాయులు జానకమ్మ, సుమలత, నాగరాణి, ప్రసన్న కుమార్, అనిత, వీణాకుమారి, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష
గద్వాల : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత బుధవారం తన చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్కను కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, మిషన్ భగీరథ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా అమె పూర్తి వివరాలను తెలుసుకున్నారు. గద్వాల నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని, వాటిని బాగుచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటి వరకు ఏయే రోడ్లకు ప్రతిపాదనలు పంపించారు, ఏ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి, ఎందుకు పనులు చేపట్టలేదనే విషయాలను ఆరా తీశారు. సమీక్షలో జడ్పీ సీఈవో కాంతమ్మ, వివిధ శాఖ ఈఈలు, అధికారులు పాల్గొన్నారు.