Share News

అధికారులు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి శూన్యమే

ABN , Publish Date - May 24 , 2024 | 10:52 PM

గ్రామాల్లో విధులు నిర్వహిం చే పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే గ్రామాభివృద్ధి శూన్యం అని జిల్లా పరిషత్‌ సీఈవో యాదయ్య అన్నారు.

అధికారులు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి శూన్యమే
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ సీఈవో యాదయ్య

- జడ్పీ సీఈవో యాదయ్య

ఆత్మకూరు, మే 24: గ్రామాల్లో విధులు నిర్వహిం చే పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే గ్రామాభివృద్ధి శూన్యం అని జిల్లా పరిషత్‌ సీఈవో యాదయ్య అన్నారు. ఆత్మకూరు మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఆత్మకూరు, మదనాపూర్‌ మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ... గ్రామాలలో సెగ్రిగేషన్‌ షెడ్‌, డంపింగ్‌ యార్డు, క్రీడా మైదానం, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటికలు ఇవి ప్రభుత్వ ఆస్తులు అని, వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటిని ఇతరులు కబ్జా చేయకుండా చూడాలని సూచించారు. ఇటీవల కాలంలో సెగ్రిగేషన్‌ షెడ్లను ఖాళీగా ఉంచి నట్లు తమ దృష్టికి వచ్చింది. పంచాయతీ కార్యదర్శు లు గ్రామంలోని తడి పొడి చెత్తలను సెగ్రిగేషన్‌ షెడ్లలో వేసి ఎరువులుగా మార్చితే గ్రామ పంచా యతీకి ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలలో నీటి వసతి కల్పించాలని అన్నారు. అనం తరం అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికైన పాఠశా లల్లో మరమ్మతులు తక్షణమే పోటీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్‌ రెడ్డి, ఆత్మకూరు, మదనాపూర్‌ ఇన్‌చార్జి ఎంపీడీవో సుజాత, ఎంపీవో నరసింహ రావు, మదనాపూర్‌ ఎంపీవో పుష్ఫ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేయండి : జడ్పీ సీఈవో

అమరచింత : అధికారులు మండల అభివృద్ధి కోసం సమన్వయంతో పని చేయాలని జడ్పీసీఈవో యాదయ్య అన్నారు. శుక్రవారం అమరచింత ఎంపీడీవో కార్యాలయాన్ని జడ్పీ డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లో మౌలిక వసతులపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీవో నరసింహయ్య, సీఆర్‌పీ స్వామి తదితరులు ఉన్నారు.

Updated Date - May 24 , 2024 | 10:52 PM