గూడెందొడ్డిలో భారీ మొసలి పట్టివేత
ABN , Publish Date - Sep 12 , 2024 | 11:25 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం లోని గూడ్డెందొడ్డిలో గురువారం భారీ మొసలి కలకలం సృష్టించింది.
జూరాల జలాశయంలో వదిలివేత
ధరూరు, సెప్టెంబరు 12 : జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం లోని గూడ్డెందొడ్డిలో గురువారం భారీ మొసలి కలకలం సృష్టించింది. సమీప కెనాల్ నుంచి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్దకు వచ్చిన మొస లిని చూసిన స్థానికులు, రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అటవీశాఖ అధికారి పర్వేజ్ అహ్మద్, సిబ్బంది హుటా హుటిన గ్రామానికి వచ్చారు. గ్రామస్థుల సహకారంతో మొసలిని బంధించి జూరాల జలాశయంలో వదిలారు. మొసలి బరువు దాదాపు 1.50 క్వింటాళ్లు ఉండొచ్చని అటవీశాఖ అధికారులు తెలిపారు.