Share News

ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:10 PM

మక్తల్‌ పట్టణానికి మంజూరైన 150 పడ కల ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

ఆసుపత్రి నిర్మాణ  పనులు త్వరగా చేపట్టాలి
ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, జూలై 28 : మక్తల్‌ పట్టణానికి మంజూరైన 150 పడ కల ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని చందా పూర్‌ సమీపంలో సర్వే నెం.919లో ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఏఈ సాయి మురళితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ రహదారిపై ఉన్న మక్తల్‌ పట్టణం శర వేగంగా అభివృద్ధి చెందుతుంద న్నారు. మక్తల్‌ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి స్థాయి పెంచి నూతనంగా నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించి పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది యాదగిరి, కాంగ్రెస్‌ నాయకులు గణేష్‌ కుమార్‌, చందాపురం వెంకట్రాములు, గుడెబల్లూర్‌ నాగరాజు, కావలి రాజేందర్‌ పాల్గొన్నారు. వేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:11 PM