Share News

ఆశాలకు కనీస వేతనం చెల్లించాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:43 PM

ప్రజల ఆరోగ్యం కాపా డటంలో అహర్నిశలు కృషి చేస్తున్న ఆశా కార్యకర్తల శ్రమదోపిడీని మాను కోవాలని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షు రాలు జయలక్ష్మి డిమాండ్‌ చేశారు.

ఆశాలకు కనీస వేతనం చెల్లించాలి
జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు

- యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి

నారాయణపేట, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యం కాపా డటంలో అహర్నిశలు కృషి చేస్తున్న ఆశా కార్యకర్తల శ్రమదోపిడీని మాను కోవాలని యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షు రాలు జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆశాల బస్సు జాతా జిల్లా కేంద్రానికి చేరుకుంది. ప్రధాన రోడ్డడ గుండా ర్యాలీ చేపట్టి సత్యనారాయణ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షు రాలు మాట్లాడుతూ.. లక్ష్యాలు పెట్టి పనిచే యించడం, పనికి తగ్గ పారితోషికం అంటూ ఆ శా కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరోగ్యంపైన పెట్టే ఖర్చు తగ్గిస్తూ పోతుందని విమర్శించారు. వైద్యాన్ని కార్పొరేట్‌ మయం చేస్తూ బడా పారి శ్రామికవేత్తల సేవలో ప్రధాని నరేంద్రమోడీ మునిగి తేలుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అశాలకు కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశా రు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 షెడ్యూల్డ్‌ పరిశ్ర మలలో పని చేస్తున్న 1.20లక్షల మంది అసంఘటిత కార్మికులకు కనీస వేతనం నిర్ణయించి అమలు చేసే విష యంలో గత కేసీఆర్‌ ప్రభు త్వం పటించు కోలేదని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభు త్వం ప్రజాపా లన ప్రారంభమై ఏడాది గడుస్తున్నా కార్మికు లను విస్మరించడం తగదన్నారు. అంతకు ముం దు బస్సు యాత్రకు ఆశావర్కర్లు బోనమెత్తి త మ సమస్యలు, గోడు ప్రభుత్వం వినాలని బతుక మ్మ ఆడారు. కార్యక్రమంలో గంగామణి, సునీ త, బాలమణి, వెంకట్రామరెడ్డి, బాల్‌రామ్‌, గౌర మ్మ, గోపాల్‌, బాలప్ప, అంజిల య్యగౌడ్‌, ఆంజనేయులు, గోవిందరాజులు, జోషి, ఉమా దేవి, నిర్మలా, భాగ్యమ్మ, శ్రీదేవి, రాధిక, విజ యలక్ష్మి, స్వాతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:43 PM