Share News

ఘనంగా వైఎస్‌ఆర్‌ జయంతి

ABN , Publish Date - Jul 08 , 2024 | 10:58 PM

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని సోమవారం మక్తల్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వైఎస్‌ఆర్‌ జయంతి
వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, జూలై 8 : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని సోమవారం మక్తల్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైఎస్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఎన్నో పథకాలు అమలు చేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మారెడ్డి, చంద్రకాంత్‌గౌడ్‌, గణేష్‌కుమార్‌, కట్ట సురేష్‌కుమార్‌గుప్తా, ఆనంద్‌గౌడ్‌, కోళ్ల వెంకటేష్‌, గంగాధర్‌ గౌడ్‌, సలంబిన్‌ ఉమర్‌, మల్లేష్‌, శంశొద్దీన్‌, కున్సి గంగాధర్‌, వెంకట్‌రెడ్డి, అశోక్‌గౌడ్‌, ఉజ్జెల్లి కృష్ణయ్య పాల్గొన్నారు.

ధన్వాడ : మండల కేంద్రంలోఇ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల శివకుమార్‌, మండలాధ్యక్షుడు నరహరి, జట్రం లక్ష్మయ్య గౌడ్‌, ఆనంద్‌ గౌడ్‌, కెంచె నరేందర్‌, నరేందర్‌ గౌడ్‌, వెంకటాపూర్‌ రాము గౌడ్‌, ఖదీర్‌ పాషా, జలీల్‌ పాషా, యూసూఫ్‌, ఒగ్గు వెంకట్రాములు, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 10:58 PM