Share News

ఘనంగా ప్రపంచ శాంతి దినోత్సవం

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:01 PM

అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం విశ్రాంత పీఈటీ బి.గోపాలం ఆధ్వర్యంలో వంద మంది విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

ఘనంగా ప్రపంచ శాంతి దినోత్సవం
మక్తల్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

మక్తల్‌, సెప్టెంబరు 21 : అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం విశ్రాంత పీఈటీ బి.గోపాలం ఆధ్వర్యంలో వంద మంది విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ద్వేశంతో ఎవరిని గెలవలేము.. శాంతితో ప్రపంచాన్ని గెలవవచ్చని వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని విశ్రాంత పీఈటీ గోపాలం ప్రారం భించి, మాట్లాడారు. 1981 సెప్టెంబరు 21న ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసి ప్రతీ ఏటా ప్రపంచ శాంతి దినోత్సవం జరుపుకోవాలన్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు శాంతికి కట్టుబడి మతసామర్యం కాపాడేందుకు కృషి చేయాలని, ఒక దేశంపై మరో దేశం ఆక్రమణలు చేయరాదన్నారు. ఎవరి మతాలు వారివే అని ఎవరి ప్రభుత్వం వారిదే అన్నారు. అన్ని మతాల సంస్కృతిని కాపాడాలన్నారు. ప్రతి ఒక్కరూ కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదర భావాల సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పీఈటీలు దామోదర్‌, అంబ్రేష్‌, జగదీష్‌కుమార్‌, సతీష్‌, మహబూబ్‌ అలీ, జగదీష్‌, ఇందిరా, రాజేశ్వరీ, సల్మాన్‌, ఈశ్వరీ, సమీనా పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:01 PM