ఘనంగా ఎమ్మెల్యే జన్మదినం
ABN , Publish Date - Sep 21 , 2024 | 10:42 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చర్ల శ్రీధర్‌గౌ డు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
- గజమాలతో ఎమ్మెల్యేకు సత్కారం
- బాలసదనంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ
గద్వాల న్యూటౌన్/ గద్వాల టౌన్/గట్టు, సెప్టెంబరు 21 : జోగుళాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చర్ల శ్రీధర్‌గౌ డు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే దంపతులను శాలువా, గజమాలతో సత్కరించారు. ఎమ్మె ల్యేకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తల్వార్‌ను బహూకరించారు. విద్యుత్ గన్‌ను కాలుస్తూ ఎమ్మెల్యే సందడి చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్‌గౌడ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌మార్గ్‌లో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్, మైత్రి ఈవెంట్స్ కాంట్రాక్టర్ చిరు ముదిరాజ్ ఆధ్వర్యంలో బాలల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బా లలకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలన్నారు. అదేవిధంగా, పట్టణంలోని రాంనగర్ రామాల యం వద్ద స్థానిక కౌన్సిలర్ టి.శ్రీనుముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను గజమాలతో ఆహ్వానించి, ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు భోజనం అందజేశారు. రాఘవేంద్ర కాలనీ అంధుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు భోజనం, స్వీట్లు పంపిణీ చేశారు. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే తన జన్మదినం సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రారంభించిన రూ.5లకే భోజనం క్యాంటీన్ రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా వచ్చి అన్నదాన కార్యక్రమం ప్రా రంభించారు. స్థానిక బీసీ బాలికల హాస్టల్‌కు ఫ్యాన్లు, జిల్లా గ్రంథాలయానికి వాటర్ కూలర్‌ను ఎమ్మెల్యే అందజేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి, మాజీ సర్పంచ్ బండ్ల జ్యోతి, ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్‌రెడ్డి గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, నాయకులు నాగిరెడ్డి, సుధాకర్ తదితరులున్నారు. అదేవిధంగా, గట్టులోని తిమ్మప్పస్వామి ఆలయంలో కాంగ్రెస్ యువ నాయకుడు గాజుల సంతోష్ ఆధ్వర్యంలో పూజలు చేసి, అంగన్‌వాడీ కేంద్రాల్లోని 150 మంది చిన్నారులకు పలకలను వితరణ చేశారు. ఎమ్మెల్యే పేరుపై ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్‌ను కట్ చేసి జన్మదిన వేడుకలు చేశారు. కార్యక్రమంలో గట్టు పీఏసీఎస్ అధ్యక్షుడు వెంకటేష్, మాజీ సర్పంచ్ మోహన్‌గౌడు, మార్కెట్ డైరెక్టర్ బజారి, కాంగ్రెస్ నాయ కులు పాల్గొన్నారు.
జోగుళాంబదేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
అలంపూర్/కేటీదొడ్డి : ఐదవ శక్తిపీఠం అలం పూర్ శ్రీజోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. శనివారం అలంపూర్ ఆలయాలను చేరుకున్న వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ఈవో పురందర్‌కుమార్ వారిని శాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు. అదేవిధంగా, పాగుంట వెంకన్న ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మాజీ మండల అధ్యక్షుడు ఉరుకుందు, కార్యకర్త లు పాల్గొన్నారు.