Share News

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Jun 06 , 2024 | 11:24 PM

ఈ నెల 9న జరిగే గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు.

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 6: ఈ నెల 9న జరిగే గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటు అధికారులు, అబ్జర్వర్లతో స్థా నిక సంస్థల అదనపు కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 18 కేంద్రాలను ఏ ర్పాటు చేశారన్నామని, 5,221 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించే సమయంలో కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ అమ లులో ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోని గంట ముందే అనుమతిస్తామన్నారు. రీజినల్‌ కోఆర్డినేటర్‌ మధుసూదన్‌శర్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:24 PM