Share News

రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN , Publish Date - May 23 , 2024 | 11:11 PM

రైతులకు ఇబ్బం దులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు.

రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
గోపాల్‌పేటలోని వరి కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

వనపర్తి అర్బన్‌, మే 23 : రైతులకు ఇబ్బం దులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు. గురువారం గోపాల్‌పేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు తరలించడంతో పాటు, ఆన్‌లైన్‌లో నమోదు అనంతరం రెండురోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధి కారులకు సూచించారు. కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని టార్పాలిన్‌ కవర్లతో కప్పాలని, కేంద్రానికి ధా న్యం వచ్చినప్పుడు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. బరువు కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యం త్రాలు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అక్కడే ఉన్న పలువురు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, తరలించిన ధాన్యం తదితర విషయాలను ఇన్‌చార్జిలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట తహసీ ల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో శంకర్‌నాయక్‌, ఎంపీవో ఉసేనప్ప, ఏపీవో నరేందర్‌, ఏపీఎం చంద్రకళ, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, తదితరులున్నారు.

భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

జిల్లాలో ఆయా విభాగాల కింద చేపడుతున్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తయ్యే వి ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నం దలాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. భూ సేకరణ, ముంపు గ్రామాల పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాటుపై గురువారం ఉదయం ఐడీవోసీ కాన్ఫరెన్స్‌ హాల్లో కలెక్టర్‌ వారాంతపు సమీక్ష నిర్వహించారు. భూసేకరణ విషయాల్లో అ ధికారులకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత గ్రామాల పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్‌ కాలువలు, చెరువు కాలువల స్థితిగతులను ముందుగానే తెలుసుకుని అవసర మైన మరమ్మతులు చేసే విధంగా లష్కర్లను పంపించాలని ఇరిగేషన్‌ అధికారిని ఆదేశించారు. చెరువు కింద ఉన్న భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ నగేష్‌, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ సీహెచ్‌.వెంకటేశ్వర్లు, ఆర్డీవో పద్మావతి, పీఆర్‌ ఇంజనీరు మల్లయ్య, ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్లు, భూసేకరణ వి భాగం నుంచి గోకుల్‌దాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:11 PM