గోవిందా.. గోవింద
ABN , Publish Date - Jun 06 , 2024 | 10:49 PM
చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని కురు మూర్తి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
- కురుమూర్తికి పోటెత్తిన భక్తులు
- దాసంగాలతో ప్రత్యేక పూజలు
చిన్నచింతకుంట, జూన్ 6 : చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని కురు మూర్తి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం అమావాస్య కావటంతో స్వామివారి గిరులు గోవింద నామస్మరణతో మారుమో గాయి. తెల్లవారుజామునుంచే ఆలయానికి భక్తులు రాక అధికంగా కన్పించింది. దాంతో ఆలయం, జాతర మైదానం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతా ల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నారా యణపేట, మక్తల్, నర్వ, రాయిచూరు, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా జాతర మైదానం లోనూ, కొండగుట్టల్లోనూ భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించారు. గుట్టమీద భక్తులు స్వా మివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గుట్టకింది భాగంలో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. దీంతో ఆలయ ప్రాంగణం జాతరను తలపించింది. భక్తులకు అన్నదాన వసతిని ఏర్పాటు చేశారు.