Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:24 PM

ప్రజా సంక్షేమంతో పాటు రైతు సంక్షేమం కాం గ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జి.మధు సూదన్‌రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయం

- జానంపేట, కొమిరెడ్డిపల్లిలో కోనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మూసాపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమంతో పాటు రైతు సంక్షేమం కాం గ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జి.మధు సూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని జానంపేట, కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రి యను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించా లని అధికారులను ఆదేశించారు. గతంలో పంట ల ధాన్యాన్ని కల్లాల్లో పెట్టుకుని కొనుగోలు కోసం ఎదురుచూసే వారని, తమ ప్రభుత్వం 15రోజుల ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులపై కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు. ధాన్యం తూకాల్లో మోసాలకు తావు లేదని, తాలు, తరుగు పేరిట కటింగ్‌లు ఉండ వని అన్నారు. ఈసీజన్‌ నుంచి సన్నరకం ధాన్యంపై రూ.500 బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపా రు. గ్రేడ్‌ ఏ ధాన్యం క్వింటాలుకు రూ.2,320 మద్దతు ధర, సాధారణ రకానికి రూ.2,300 ప్రకటించిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధం గా కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకా లను చేపట్టి అన్నివర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగేలా చేస్తోందన్నారు. రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన రైతు లందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజు, మండల కాం గ్రెస్‌ పార్టీ అఽఽధ్యక్షుడు శెట్టిశేఖర్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కృష్ణయ్య, విండో డైరెక్టర్‌ రాంకుమార్‌, మండల నాయకులు బండ రాజేందర్‌రెడ్డి, చెన్నమ్మ, నిరంజన్‌, లక్ష్మీ కాంత్‌రెడ్డి, బోడి వెంకటేష్‌, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, అచ్యుతారెడ్డి, బాలరాజ్‌, జనార్ద న్‌ రెడ్డి, సుఽధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:24 PM