Share News

ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:00 PM

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు.

ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోవాలి
సింగారంలో బడిబాటలో పాల్గొన్న ఉపాధ్యాయులు

నారాయణపేట రూరల్‌, జూన్‌ 10 : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు కోరారు. మండల పరిధిలోని సింగారం గ్రామంలో జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలోని ఇంటింటికీ తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యతో పాటు విద్యార్థులకు యూనిఫాం, నోట్‌బుక్కులు పంపిణీ ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. గతంలో తెలుగు మీడియం మాత్రమే ఉండేదని ప్రస్తుతం ప్రైవేటుకు ధీటుగా ఇంగ్లిష్‌ మీడియం బోధనప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మాధవి, ఉపాధ్యాయులు లక్ష్మణ్‌, భానుప్రకాశ్‌, శోభారాణి, శిరీష పాల్గొన్నారు.

పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించండి

ధన్వాడ : మండల కేంద్రమైన ధన్వాడ సంత బజార్‌ పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కెంచె బాల్‌రాజు, మరికల్‌ శ్రీనివాసులు, పుష్పలత, మౌనిక, సౌజన్య పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 11:00 PM