‘కార్పొరేట్’కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:35 PM
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్, జూన్ 12 : ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం అలంపూర్ దళితవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ మనోరమ, ఎంఈవో అశోక్‌కుమార్, జిల్లా నోడల్ అధికారి హృదయరాజు, మునిసిపల్ కమిషనర్ సరస్వతి, ఎంపీడీవో అబ్దుల్ జబ్బార్, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, రాజన్న, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా బీఆర్‌ఎస్
వడ్డేపల్లి : కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని జిల్లేడుదిన్నె గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త మారెన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ఉండటంతో అతడి కుటుం బానికి రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. దీనికి సంబంధిం చిన చెక్కును మారెన్న భార్య జయమ్మకు అందించారు.