Share News

ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి

ABN , Publish Date - Sep 26 , 2024 | 11:22 PM

ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీ సుకెళ్లాల్సిన బాధ్యత అఽధికారు లదేనని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలని, ప్రజలకు పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని ఎంపీ మల్లురవి అన్నారు. గు రువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా స మీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలో ని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి స మన్వయ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.

 ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి
జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ

- ఎంపీ మల్లురవి

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యోతి) : ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీ సుకెళ్లాల్సిన బాధ్యత అఽధికారు లదేనని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలని, ప్రజలకు పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని ఎంపీ మల్లురవి అన్నారు. గు రువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా స మీకృత జిల్లా కార్యాలయా ల సముదాయంలో ని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి స మన్వయ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చేపడుతున్న సం క్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎంపీ తెలిపారు. ఈ సమావేశానికి మెంబర్‌ సెక్రటరీగా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎమ్మెల్సీ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధనర్‌రెడ్డి, డీఎఫ్‌వో రోహిత్‌గోపిడీ, అదనపు కలెక్టర్లు సీ తారామారావు, దేవసహాయం హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జిల్లాలో వివిధ కార్యక్రమాలు అమలు, అభివృద్ది కార్యక్రమాల పురోగ తిపై పూర్తిస్థాయిలో చర్చించారు. ఎంపీ మల్లురవి బ్యాంక్‌ అధి కారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న పథకాలపై అవగాహన కలిగి అవి గ్రౌండయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగియ డానికి గడువు సమీపిస్తున్నందున లక్ష్యసాధనలో వెనకబడిన బ్యాంక్‌ ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని వివిధ పథకాల కింద కేటాయించిన ఆరు యూనిట్లు మంజూరయ్యేలా చూడా లన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. అధికారులు త మ శాఖలోని వివిధ సమస్యలను నివేదికలను సిద్ధం చేసి తమ దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు. అనంతరం విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వ కుర్తి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. డీఆర్‌డీఏ పీడీ చిన్న ఓబులేష్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 11:22 PM