Share News

నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి

ABN , Publish Date - May 25 , 2024 | 11:11 PM

రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, డీలరు నుంచి రశీదును తప్పక తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం.సంతోష్‌ రైతులకు సూచించారు.

నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి
రైతులకు అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ బీఎం.సంతోష్‌

- రశీదు, విత్తన ప్యాకెట్లను భద్రపర్చాలి

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- విత్తన కొనుగోళ్లపై రైతులకు అవగాహన

- మండల కేంద్రాల్లోనూ కొనసాగిన అవగాహన కార్యక్రమాలు

గద్వాల, మే 25 : రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, డీలరు నుంచి రశీదును తప్పక తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం.సంతోష్‌ రైతులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామంలోని రైతువేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై, రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ నుంచి అనుమతి పొందిన డీలర్లు, దుకాణాల యజమానుల నుంచే విత్తనాలు కొనుగో లు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన తర్వా త రశీదు తీసుకోవాలన్నారు. విత్తనాలు విత్తిన తర్వా త ప్యాకెట్లను భద్రపర్చాలని సూచించారు. నాలుగు నెలల తర్వాత విత్తనాల వల్ల పంట దిగబడి రాకపో తే సంబంధిత డీలరుపై చర్యలు తీసుకుంటామని అ న్నారు. లూజు విత్తనాలను కొనుగోలు చేయొద్దని సూచించారు. ఎవరైనా లూజు విత్తనాలను, నాణ్యతలేని విత్తనాలను విక్రయిస్తుంటే వారి సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్ర తీ గ్రామంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారని వారి సూచనలు పాటించాలని ఆయన తెలి పారు. విత్తన కొనుగోలులో వారు మీకు సహకరిస్తారని వివరించారు. ఇప్పటికే డీలర్లకు అవగాహన కల్పించామని వారు గోదాములు, షాపులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారన్నారు. కార్యక్రమంలో జి ల్లా వ్యవసాయ అధికారి గోవిందనాయక్‌, ఏడీఏ సం గీతలక్ష్మి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

- వడ్డేపల్లి : మండలంలో గుర్తింపు ఉన్న డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలని మండల వ్యవ సాయ అధికారిణి రాధ రైతులకు సూచించారు. విత్త న కొనుగోళ్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం వడ్డేపల్లి మండలంలో జూలకల్‌, కొంకల గ్రామాల రైతులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో వారి నుంచి తప్పనిసరిగా రశీ దు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఈవోలు రవీందర్‌రెడ్డి, విమల, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నా రు. అదేవిధంగా వడ్డేపల్లి, రామాపురం తనగల గ్రా మాల్లో కూడా వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు.

- మల్దకల్‌ : మండలంలోని ఎల్కూరు గ్రామం లో శనివారం వర్షాకాలంలో పంట సాగు, నాణ్యమైన విత్తనాల కొనుగోలుపై రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఏవో రాజశేఖర్‌ పాల్గొని మా ట్లాడారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా జారీ చేయబడిన లైసెన్సు గల డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని, విత్తనాలు కొనుగోలు చేసే చోట రశీదుపై కంపెనీ పేరు, విత్తన రకం, లా ట్‌ నెంబరు, డీలరు సంతకం తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. పత్తి విత్తనం బోల్‌గార్డ్‌ రెండు ప్యాకె ట్ల ధర రూ.864లుగా ఉందన్నారు. అదేవిధంగా, తాటికుంట, శేషంపల్లి, అడవిరావులచెర్వు, సద్దలోనిపల్లి గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వ హించారు. సమావేశంలో ఏఈవో కిశోర్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి మైబీ, రైతులు ఉన్నారు.

- రాజోలి : మండల పరిధిలోని తూర్పు గార్లపాడులో శనివారం రైతులకు విత్తన కొనుగోళ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఈవో ఇబ్రహీం మాట్లాడుతూ రైతులు గురింపు ఉన్న, నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. పంటల దిగుబడి కోసం రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. 60శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌లు ఇచ్చి విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్ర మంలో రైతులు రాముడు, సైమాన్‌, రామకృష్ణ, మద్దిలేటి, నాగరాజు, కురుమన్న, నాగన్న, రమేష్‌, ప్రవీణ్‌ తదితరులున్నారు.

Updated Date - May 25 , 2024 | 11:11 PM