Share News

గోల్‌మాల్‌

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:31 PM

జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుం ది.

 గోల్‌మాల్‌

- కస్టమ్‌ మిల్లింగ్‌లో భారీ అవినీతి

- వారం రోజులు గడువున్నా వెనక్కి రాని 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం

- మిల్లర్లు కొందరు అధికారులతో కుమ్మక్కు

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుం ది. ఖరీఫ్‌సీజన్‌లో కస్టమ్‌ మిల్లింగ్‌కు పం పించిన ధాన్యం బియ్యం రూపంలో వెన క్కి రాకపోవడంలో అనేక ఆరోపణలు వ స్తున్నాయి. మిల్లర్లు కొందరు అధికారుల తో కుమ్మక్కయి 6ఏ కేసులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లు విమర్శలు ఉ న్నాయి. ఈ క్రమంలో జిల్లాలో అనేక సం ఘటనలు వెలుగులోకి వస్తున్నా కూడా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది.

వెనక్కి రాని బియ్యం

జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 82 రైస్‌ మిల్లులకు కస్టమ్‌ మిల్లింగ్‌ కింద 73 వేల 137 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని ఇచ్చారు. క్వింటాలుకు 67 కిలోల చొప్పున కస్టమ్‌ మిల్లింగ్‌ కింద 49 వేల 247 మెట్రి క్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా ఇ ప్పటి వరకు వివిధ రైస్‌ మిల్లులకు చెంది న యజమానులు కేవలంలో 30 వేల 424 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఫుడ్‌ కా ర్పొరేష్‌ ఆఫ్‌ ఇండియా తిరిగి ఇచ్చారు. ఇంకా రైస్‌ మిల్లర్ల నుంచి కస్టమ్‌ మిల్లింగ్‌ కింద 18 వేల 323 మెట్రిక్‌ టన్నుల బి య్యం రావాల్సి ఉంది. దీనికి అక్టోబరు 31 వరకు మాత్రమే గడువు ఉండగా జిల్లా లోని మిల్లర్ల స్పందన నామమాత్రంగా ఉంది. కేవలం ఆరు రోజుల వ్యవధిలో 18 వేల 323 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎలా రికవరీ చేస్తారో అధికారుల వద్ద స్పష్టత లేదు.

31 తర్వాత క్రిమినల్‌ కేసులు

కస్టమ్‌ మిల్లింగ్‌ కింద ఇంకా జిల్లాలో 18 వేల 323 మెట్రిక్‌ టన్నుల వరి ధా న్యానికి సంబంధించిన లెక్కలు తేలాల్సి ఉండగా ఈ నెల 31 వరకు మిల్లర్లు నుం చి సానుకూల స్పందన రాకుంటే క్రిమిన ల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి కె.శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు. క్వింటాల్‌ వరికి తరుగు పోను 67 కిలోల చొప్పున బియ్యం అందించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై అక్టోబరు 31 తర్వాత క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందిగా పోలీసు శాఖకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Oct 25 , 2024 | 11:31 PM