Share News

వైభవంగా గోదాదేవి,రంగనాథుడి కల్యాణోత్సవం

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:02 PM

శ్రీరంగనాథ ఆలయంలో సంక్రాంతి సందర్భంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో జరిగింది.

వైభవంగా గోదాదేవి,రంగనాథుడి కల్యాణోత్సవం
శ్రీరంగనాథ ఆలయంలో శ్రీగోదాదేవి రంగనాథుని కల్యాణోత్సవం

శ్రీరంగాపూర్‌, జనవరి 14: శ్రీరంగనాథ ఆలయంలో సంక్రాంతి సందర్భంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో జరిగింది. సంక్రాంతి పండుగకు ప్రతీ వైష్ణవ ఆలయంలో జరిగే విధంగా శ్రీరంగనాథ స్వామి ఆలయంలో కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ అర్చకులు గోదా కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కల్యా ణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం భోగి సందర్భంగా రాష్ట్ర నలుమా లల నుంచి వాహనాలల్లో భక్తులు తరలి వచ్చారు. ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది.

Updated Date - Jan 14 , 2024 | 11:02 PM