Share News

వరి రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వండి

ABN , Publish Date - May 16 , 2024 | 11:17 PM

గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముం దు వరి రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కొల్లాపూర్‌ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ముందు బీ ఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు.

 వరి రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వండి
కొల్లాపూర్‌ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

- ఆర్డీవో కార్యాలయం ముందు బీఆర్‌ఎస్‌ ధర్నా

కొల్లాపూర్‌, మే 16 : గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముం దు వరి రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కొల్లాపూర్‌ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ముందు బీ ఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ద్దేశించి మాచినేనిపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ చింతకుంట శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ కాటం జంబులయ్య, బీ ఆర్‌ఎస్‌ నాయకులు కట్ట శ్రీనివాసులు మాట్లాడారు. రై తులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న కాం గ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిలదీస్తా మని వారు పేర్కొన్నారు. సన్నరకం వడ్లతోపాటు దొడ్డు రకం వడ్లకు కూడా రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాట ప్రకారం 500బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీ లు అమలయ్యేంత వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు, రైతుల పక్షాన పోరాడుతామని వారు తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని రై తుబంధు, రైతుబీమా పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం యథావిధి గా కొనసాగించాలని, దళితబంధు పథకాన్ని కూడా కొనసాగించి అ ర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాల ని, బీసీ బంధు పథ కంతో నిరుద్యోగ యు వతీ యువకులకు న్యాయం చేకూర్చాలని వారు డిమాండ్‌ చేశా రు. కాంగ్రెస్‌ పార్టీ ఇ చ్చిన హామీలు అమల య్యేంత వరకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సా రథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో తాము పోరాడు తామని వారు తెలిపారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో నాగరాజుకు అందజేశా రు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, బీఆర్‌ ఎస్‌ నాయకులు పోతుల వెంకటేశ్వర్లు, పుట్టపాగ నాగరా జు, రాంచందర్‌, కౌన్సిలర్‌ కృష్ణమూర్తి, యాదన్నగౌడ్‌, ఖాదర్‌పాష, భాస్కర్‌గౌడ్‌, కలర్‌ మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:17 PM