Share News

ఘనంగా గంగాభవాని కల్యాణ మహోత్సవం

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:57 PM

కొ ల్లాపూర్‌ పట్టణంలోని గంగాభవాని దే వాలయంలో గురువారం కనుల పం డువగా గంగాభవాని కల్యాణ మహో త్సవం కొనసాగింది.

 ఘనంగా గంగాభవాని కల్యాణ మహోత్సవం
కొల్లాపూర్‌లో కనుల పండువగా జరిగిన గంగాభవాని కల్యాణ మహోత్సవం

కొల్లాపూర్‌, ఫిబ్రవరి 29 : కొ ల్లాపూర్‌ పట్టణంలోని గంగాభవాని దే వాలయంలో గురువారం కనుల పం డువగా గంగాభవాని కల్యాణ మహో త్సవం కొనసాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కల్యా ణోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించా రు. ఉదయం 10గంటలకు అమ్మవా రికి వస్త్ర సమర్పణం, 11:05గంటలకు కల్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 1గంటకు అన్నదానం, సాయంత్రం 4గంటలకు తెప్పోత్సవం, సాయంత్రం 6గంటలకు అమ్మవారి రథోత్సవం, శో భాయాత్ర పట్టణ పురవీధుల గుండా ఘనంగా నిర్వహించారు. కల్యాణ మ హోత్సవానికి కాంగ్రెస్‌ పార్టీ నాయ కుడు డాక్టర్‌ పగిడాల శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జూపల్లి రామారావు, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తల్లి బీరం బిచ్చమ్మలు కల్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గంగపుత్ర సంఘం, గంగాభవాని దేవస్థాన కమిటీ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.

Updated Date - Feb 29 , 2024 | 10:57 PM