Share News

టీబీ రోగులకు నిధులు నిల్‌

ABN , Publish Date - May 23 , 2024 | 11:39 PM

క్షయవ్యాధి చాపకింద నీరులా వ్యాపించి అనేక మందిని పొట్టన పెట్టుకుంటోంది.

టీబీ రోగులకు నిధులు నిల్‌
వ్యాధిగ్రస్తులకు జిల్లా కేంద్రంలో పౌష్టికాహార కిట్లు అందిస్తున్న అధికారులు (ఫైల్‌)

- క్షయ రోగులకు అందని పౌష్టికాహారం డబ్బులు

- ఏడు నెలలుగా జమకాని నిధులు

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2021 మంది రోగులు

వనపర్తి వైద్యవిభాగం, మే 23: క్షయవ్యాధి చాపకింద నీరులా వ్యాపించి అనేక మందిని పొట్టన పెట్టుకుంటోంది. వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహింస్తోంది. క్షయ వ్యాధి దగ్గు, తుమ్ములు, ఉమ్మివేయడం ద్వారా వ్యాపి స్తుంది. ఈ వ్యాధి మనిషి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తు రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. వ్యాధిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఎంతో శక్తివంతమైన మం దులు పంపిణీ చేయడంతో పాటు పౌష్టికాహారం తీసుకునేందుకు నెలకు రూ. 500 చొప్పున రోగి అకౌంట్‌లో జమ చేస్తుంటారు. కానీ ఏడు నెలలుగా ఈ డబ్బులు జమ చేయడం లేదు.

న్యూట్రిషన్‌ ఇంప్లిమెంట్‌ కోసం...

క్షయవ్యాధి రోగులకు న్యూట్రిషన్‌ ఇంప్లిమెంట్‌ కోసం ప్రభు త్వం ప్రతీ రోగికి నెలకు రూ. 500 చొప్పున వారి అకౌంట్‌లో జమ చేస్తుంది. అంతే కాకుండా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సైతం తమ వంతు చేయూతగా స్వచ్ఛందంగా కొందరు దాతల ద్వారా పౌష్టికాహార కిట్లను కూడా అందిస్తున్నారు. క్షయ వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం ఆరు మాసాల పాటు వైద్య సేవలు అంది స్తోంది. ఈ ఆరు మాసాలు మందులు వాడుతూ.. ప్రభుత్వం అందించే నగదుతో బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని వైద్యు లు సూచిస్తారు. ఒకవేళ ఆరు నెలల్లో వ్యాధి నయం కాకపోతే మరో మూడు మాసాలు వైద్యం అందిస్తారు. వైద్యంతో పాటు పౌష్టికాహారం కోసం నగదు కూడా జమ చేసేలా పథకాన్ని అమలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏడు నెలలుగా బడ్జెట్‌ లేదనే సాకుతో నగదు జమ చేయడం నిలిపేసింది.

నగదు జమ ఇలా....

క్షయవ్యాధిగ్రస్తులకు నెలకు ప్రభుత్వం అందించే నగదు జమచేసే ప్రక్రియను డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) అంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,021 మంది క్షయవ్యాధిగ్రస్తులు ఉన్నారు. వనపర్తి జిల్లా లోని 14 మండలాల్లో ఈ ఏడాది 366 మంది క్షయవ్యాధి గ్రస్తులు ఉన్నారు. గద్వాలలో 384 మంది, నారాయణపేటలో 224 మంది, నాగర్‌కర్నూల్‌లో 430 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 617 మంది ఉన్నారు. వారికి ప్రతీ నెల ఎండీఆర్‌ (మల్టీ డ్రగ్‌ రెసిస్టెంన్సీ) కోసం రూ. 500లు వారి అకౌంట్‌లో జమ కావాల్సి ఉంది. మూడు రకాలుగా అందిచే ఈ పథకంలో మొదటగా 0 నుంచి 84 రోజుల వ్యవధిలో రూ. 1,500 ఒకసారి, 85 రోజుల నుంచి 168 రోజుల వ్యవధిలో రెండోసారి రూ. 1,500లు జమ చేసి, 169 రోజుల నుంచి మూడో విడతగా రోగం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు వారివారి అకౌంట్‌లో ప్రతీ నెల రూ. 500 చొప్పున నగదు జమ చేయాల్సి ఉంటుంది. కానీ గత ఏడాది అక్టోబరు నెల నుంచి బడ్జెట్‌ లేదనే సాకుతో రోగులకు నగదు అందడం లేదు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 366 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఏడు నెలలుగా నగదు కోసం ఎదురుచూస్తు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే నగదు రోగుల ఖాతాలో జమచేయాలని కోరుతు న్నారు.

Updated Date - May 23 , 2024 | 11:39 PM