మద్దూర్ అభివృద్ధికి.. రూ.62 కోట్ల ప్రతిపాదనలు
ABN , Publish Date - Feb 10 , 2024 | 11:01 PM
మద్దూర్ పట్టణ అభివృద్ధికి రూ.62 కోట్ల ప్రతిపాదనలు కాడా అధికారికి ఇవ్వడం జరిగిందని జడ్పీటీసీ సభ్యుడు రఘునతిరెడ్డి అన్నారు.
- కాడా కింద ప్రతీ రోడ్డు డబుల్‌గా విస్తరణ
- పేట - కొడంగల్ లిఫ్టుతో లక్ష ఎకరాలకు పైగా సాగు
- జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి
మద్దూర్, ఫిబ్రవరి 10 : మద్దూర్ పట్టణ అభివృద్ధికి రూ.62 కోట్ల ప్రతిపాదనలు కాడా అధికారికి ఇవ్వడం జరిగిందని జడ్పీటీసీ సభ్యుడు రఘునతిరెడ్డి అన్నారు. శనివారం మద్దూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ నరసింహ, మండల నాయకులు వీరేశ్‌గౌడ్, రమేష్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. కాడా కింద మండలంలోని సింగల్ రోడ్లన్నీ డబుల్‌గా మార్చేందు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు రోడ్ల సర్వే ప్రక్రియ అధికారులు ప్రారంభించారన్నారు. గతంలో మద్దూర్‌లో మోడల్ స్కూల్ నిర్మాణానికి రేవంత్‌రెడ్డి సొంత నిధులతో తీసుకున్న ఐదెకరాల భూమిలో రూ.20 కోట్ల వ్యయంతో గురుకుల పాఠశాల, కళాశాల నిర్మాణం చేట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అలాగే మద్దూర్‌లోని వివిధ రోడ్లను పాత బస్టాండ్ చౌరస్తా నుంచి ఒక కిలో మీటర్ నుంచి 1.5 కి.మీ మేర విస్తరణకు జరగనున్నట్లు వారు వెల్లడించారు. వీటితో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపడం జరగిందన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం మద్దూర్‌ను మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు డిగ్రీ కళాశాల, స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు వారు వెల్లడించారు. జీవో 14 కింది పేట - కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్‌కు ప్రభుత్వం రూ.2,945 కోట్లు కేటాయించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల రూపు రేఖలు మారనున్నాయన్నారు. సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షడు నర్పింహా గౌడ్, తాలూకా అధ్యక్షడు వీరేశ్‌గౌడ్, రమేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జనార్ధన్, రవికుమార్, అబ్దుల్ రహీం, చంద్రమౌలి, బాబు, నిడ్జింత విజయ్ పాల్గొన్నారు.