తొలిరోజు అంతంతే..
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:08 PM
బడి గంట మోగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు. కొన్ని తరగతి గదుల్లో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు.

ప్రారంభమైన పాఠశాలలు
మొదటి రోజు తక్కువగా హాజరైన విద్యార్థులు
మామిడి ఆకులతో స్కూళ్లకు తోరణాలు
పలు చోట్ల స్టూడెంట్స్‌కు పూలు ఇచ్చి ఆహ్వానించిన ఉపాధ్యాయులు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం జూన్ 12: బడి గంట మోగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు. కొన్ని తరగతి గదుల్లో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. ఉపాధ్యాయులు మాత్రం అందరూ వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోవడంతో సందడిగా మారాయి. ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలు కట్టి, కొబ్బరి మట్టలతో అలంకరించారు. పండుగ వాతావరణం కల్పించేలా తీర్చిదిద్దారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పూలు ఇచ్చి స్వాగతం పలికారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు రాని విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లారు. ప్రభుత్వ స్కూళ్లలో కల్పిస్తున్న వసతుల గురించి వివరించారు. నాణ్యమైన భోజనం, ఉచితంగా దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామని, పిల్లలను బడికి పంపాలని తల్లిదండ్రులను కోరారు.
యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ
ప్రభుత్వం చెప్పిన విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాపతినిధులు, ఉపాధ్యాయుల విద్యార్థులకు వాటిని అందించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ న్యూటౌన్, రాంనగర్ ఉన్నత పాఠశాలల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్‌అలీ, డీఈవో రవీందర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పుస్తకాల్లో మాజీ సీఎం పేరుపై గందరగోళం
విద్యార్థులకు ఉచితంగా అందించన పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉండటంతో గందరగోళం చెలరేగింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలాచోట్ల పాఠశాలల్లో ప్రజాపతినిధులు విద్యాశాఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్తల్ మండలంలో జరిగిన కార్యక్రంమంలో ఎమ్మెల్యే శ్రీహరి అఽధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవియమై అధికారులు ఎమ్మెల్యేకు సర్ది చెప్పారు. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.