Share News

ఆర్థిక వెనుకబాటు చదువుకు అడ్డంకి కాదు

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:12 PM

కుటుంబ ఆర్థిక వెనుకబాటుతనం చదవుకు అడ్డంకి కాదని అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాసులు అన్నారు.

ఆర్థిక వెనుకబాటు చదువుకు అడ్డంకి కాదు
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌

- అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాసులు

- ప్రతిభతో రాణించాలని విద్యార్థులకు హితవు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 2 : కుటుంబ ఆర్థిక వెనుకబాటుతనం చదవుకు అడ్డంకి కాదని అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాసులు అన్నారు. పట్టుదలతో చదువు తూ ప్రతిభ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ఉద్భోదించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం నిర్వహించే ప్రేరణ మార్గనిర్దేశక తరగతులను శుక్రవారం పట్టణం లోని బాలభవన్‌లో అదనపు కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రేరణ తరగతుల గురించి వివరించారు. చదువుతో విజ్ఞానం, వికాసం లభిస్తుందని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు తోడ్పడుతుందన్నారు. రెండు నెలల్లో రానున్న వార్షిక పరీక్షల కోసం విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సమాయత్తం కావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బెడ్‌షీట్లు, స్కూల్‌బ్యాగ్‌లు, ఆల్‌ ఇన్‌ గైడ్స్‌, నాలుగు జతల యూనిఫాం, స్పోర్ట్స్‌ కిట్లు, ఇతర దైనందిన వినియోగ వస్తువులను అందజే శారు. కార్యక్రమంలో ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్వేతాప్రియదర్శిని, మహబూబ్‌నగర్‌కు చెందిన మానసిక నిపుణులు లక్ష్మణ్‌, సరోజ, వార్డెన్లు ప్రమీల, సుజాత, సుధీర్‌, శేఖర్‌, జయరాం, అధికారులు ఉన్నారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

వృత్తి సంబంధ నైపుణ్య శిక్షణను పొంది ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మహిళలు కృషి చేయా లని అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాసులు అన్నారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌ ప్రొడక్టవిటీ కౌన్సిల్‌ సహకారంతో పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘సంకల్ప’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్యూటీ షియన్‌, టైలరింగ్‌ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణను పొంది, తాము నివసించే ప్రాంతంలోనే ఆర్థిక అభివృ ద్ధిని సాధించొచ్చని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలు అందించారు. కార్యక్ర మంలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ యాదగిరి, ఉపాధి కల్పనశాఖ అధికారి డాక్టర్‌ ఎం.ప్రియాంక, గద్వాల మునిసిపల్‌ కమిషనర్‌ కె.నర్సింహ, పీఎంకేవై కేంద్రం మేనేజర్‌ హనిమిరెడ్డి, ఏపీపీసీ కౌన్సిల్‌ కో ఆర్డినేటర్‌ నాగదుర్గ, మాస్టర్‌ ట్రైనర్‌ శ్రీరామరాయలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:12 PM