Share News

పండుగలు ఐక్యతకు ప్రతీకలు

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:17 PM

పండుగలు ఐక్యతకు ప్రతీకలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పండుగలు ఐక్యతకు ప్రతీకలు
ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు మహబూబ్‌నగర్‌లోనిఈద్గా వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులు

- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- జిల్లాలో ఘనంగా బక్రీద్‌

- ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 17 : పండుగలు ఐక్యతకు ప్రతీకలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని రహెమానియా ఈద్గాలో ఎమ్మెల్యే యెన్నంతో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భారత దేశంలో కులమతాలకతీతంగా హిందూ, ముస్లింలు పండుగలు జరుపుకుంటారన్నారు. మహబూబ్‌నగర్‌ ప్రేమ ఆప్యాయతలకు నిలయమని, ఇక్కడ అందరు కలిసి ఉండాలన్నారు. మాజీ మంత్రి డా.వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలిచింద న్నారు. హిందూ ముస్లింలందరూ గంగా, జమున తహజీబ్‌లా జీవనం సాగిస్తున్నారని గుర్తుచేశారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌ మాట్లాడుతూ భారతదేశం హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీక అని, ఇక్కడ అందరు కలిసి మెలిసి ఉంటారన్నారు. ఒకరి పండుగ ఒకరు జరుపుకొని మన ఐక్యతను చాటాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌అహ్మద్‌, మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఇంతియాజ్‌ ఇసాక్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ.నర్సింహులు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అబ్దుల్‌రహెమాన్‌, నాయకులు మన్నె జీవన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఎన్‌పీ.వెంకటేశ్‌, మ క్సూద్‌, చంద్రకుమార్‌గౌడ్‌, బెనహర్‌, సిరాజ్‌ఖాద్రీ, లక్ష్మణ్‌యాదవ్‌, అజ్మత్‌, రాజేందర్‌రెడ్డి, మోసిన్‌ఖాన్‌, ఫారుక్‌హుస్సేన్‌, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

- మిడ్జిల్‌ : మండల కేంద్రంతో పాటు, పరిధి లోని గ్రామాల్లో బక్రీద్‌ను పురస్కరించుకొని ఈద్గాల్లో సోమవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండల కేంద్రంలోని మజీద్‌ నుంచి ర్యాలీగా వెళ్లి ఈద్గా వద్ద ఈదుల్‌ఆదా నమాజ్‌ను చేపట్టారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు గౌస్‌, హిమామ్‌ఇర్ఫాన్‌, మౌజాన్‌ మహబూబ్‌, అధ్యక్షుడు జహంగీర్‌, ఉపాధ్యక్షుడు సిద్దిక్‌, సిరాజ్‌, మహబూబ్‌, ప్రధాన కార్యదర్శి నిస్సార్‌, సభ్యులు నబ్బి, నిరంజన్‌, హకీంపాషా, ఖాజా, మతిన్‌, ఆలీ, రహీం, సయ్యద్‌, జహంగీర్‌ తదితరులున్నారు.

- హన్వాడ : మండల కేంద్రంతో పాటు, గ్రామాల్లో ముస్లింలు సోమవారం బక్రీద్‌ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ పార్టీల నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.

- జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గంలో ముస్లింలు సోమవారం బక్రీద్‌ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మునిసిపల్‌ పరిధిలోని పాతబజారు, జడ్చర్లలోని ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని వివిధ గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

- భూత్పూర్‌ : బక్రీద్‌ సందర్భంగా స్థానిక ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, నాయకులు మురళీధర్‌గౌడ్‌, నారాయణగౌడ్‌, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్‌, యువత విభాగం నాయకులు గడ్డం ప్రేమ్‌కుమార్‌ తదితరులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మునిసిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో మైనార్టీ నాయకుడు ఫారుక్‌ ఇంటి వద్ద ఏర్పాటుచేసిన బక్రీద్‌ పండుగ విందుకు బీజేపీ పార్లమెంటు నాయకుడు డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. మద్దిగట్ల గ్రామ మజీద్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి తదిత రులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- గండీడ్‌ : బక్రీద్‌ సందర్భంగా మండల పరిధిలోని గ్రామాల్లో ముస్లింలు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. తహసీల్దార్‌ నాగలక్ష్మి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, వెన్నాచేడ్‌ మాజీ సర్పంచు పుల్లారెడ్డి, రాంచంద్రారెడ్డి తదితరులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- నవాబ్‌పేట/బాలానగర్‌/మహమ్మదాబాద్‌/ రాజాపూర్‌, కోయిలకొండ : మండల కేంద్రాలతో పాటు, గ్రామాల్లో బక్రీద్‌ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు పార్టీల నాయకులు ఈద్గాల వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 17 , 2024 | 11:17 PM