Share News

రైతులకు పంట నష్ట పరిహారం అందించాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:18 PM

పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని

రైతులకు పంట నష్ట పరిహారం అందించాలి
రైతులకు పంట నష్ట పరిహారం అందించాలి

- గద్వాలలో రేపు రైతు దీక్ష : బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

గద్వాల, ఏప్రిల్‌ 3 : పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల ఐదవ తేదీన డీకే బంగ్లాలో రైతు దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆరవ తేదీన బీజేపీ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ ఎక్బోటే, అసెంబ్లీ కన్వీనర్‌ రామాంజనేయులు, నాయకులు బల్గెర శివారెడ్డి, చిత్తారి కిరణ్‌, దాసు, హనిమిరెడ్డి, నాగప్ప, ఉప్పరి గోపాలకృష్ణ, తిరుమల్‌ పాల్గొన్నారు.

బీజేపీ హయాంలోనే గ్రామీణాభివృద్ధి

మానవపాడు : బీజేపీ హయాంలోనే అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. మండలంలోని జల్లాపురం, బోరవెల్లి, పల్లెపాడు గ్రామాల్లో బుధవారం మానవపాడు మండల అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, రైతు వేదికలు, శ్మశానవాటికల నిర్మాణం, ఆయుష్మాన్‌ భారత్‌, ఆవాస్‌ యోజన తదితర పథకాలను వివరించారు. ఆయన వెంట నాయకులు రాజగోపాల్‌, బలరాంరెడ్డి, రాజశేఖర్‌శర్మ, లక్ష్మీనారాయణ, జగన్‌, నాగరాజు, సంజీవరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 11:18 PM