Share News

సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:45 PM

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేటకు రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభ ఏర్పాట్లపై ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఎంపీ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శివకుమార్‌రెడ్డి దృష్టి సారించారు.

సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
హెలిప్యాడ్‌ ఏర్పాటు స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ లింగయ్య

నారాయణపేట ఏప్రిల్‌ 12: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేటకు రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభ ఏర్పాట్లపై ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఎంపీ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శివకుమార్‌రెడ్డి దృష్టి సారించారు. సింగారం చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ స్థలాన్ని, నారాయణపేట క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని డీఎస్పీ లింగయ్య శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌, బారికేడ్ల ఏర్పాటు, పోలీస్‌ బందోబస్తు, ట్రాఫిక్‌ మళ్లింపుపై డీఎస్పీ సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు సూచనలు ఇచ్చారు.

Updated Date - Apr 12 , 2024 | 10:45 PM