ఈవీఎంలు సురక్షితం
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:24 PM
ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు సురక్షితంతో పాటు కచ్చితత్వంతో కూడినవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 29: ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు సురక్షితంతో పాటు కచ్చితత్వంతో కూడినవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోమవారం ఐడీవోిసీలో ఈవీఎం, వీవీ ప్యాట్ ల ప్రదర్శనను అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, తిరుపతి రావు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రజాప్రతినిధు లు నమూనా ఓటును వినియోగించి తాము వేసిన అభ్యర్థికే ఓటు పడిందా లేదా అని నిర్ధారించుకున్నారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల నిర్వహణకు విని యోగిస్తున్న ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాలు అత్యంత సురక్షిత మైనవని తెలిపారు. వీటిని ఇతరాత్ర నెట్‌వర్క్‌తో అనుసం ధానం చేసేందుకు వీలు లేదని తెలిపారు. నేటి నుంచి కలెక్ట రేట్‌లోని రూమ్ నంబరు 10లో ఈవీఎం వీవీ ప్యాట్‌ల ప్రదర్శ న ఉంటుందని వివరించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎవరైనా సరే ప్రదర్శన కేంద్రంలో నమూనా ఓటు వేసి పనితీరును పరిశీలించుకోవచ్చని తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాం నుంచి ప్రజాప్రతినిధుల సమ క్షంలో ప్రదర్శన కోసం ఈవీఎం, వీవీప్యాట్‌లను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
జంతువులను ప్రేమించాలి
మూగజీవాలను ప్రేమగా చూడాలని జీవ హింస నివార ణను ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతు హింస నివారణపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జంతు హింస నివారణ అనేది ప్రతీ ఒక్కరి బాధ్యత అని, మూగ జీవాలను హింసించకుండా వాటికి కనీస ప్రేమ ఆప్యాయత చూపించాలని తెలిపారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో నిర్వహించిన సమావే శంలో కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంద ర్భంగా రోడ్డు భద్రతకు సంబంధించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వాహనాలపై వచ్చే ప్రతీ ఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకొని రావాలని సూచించారు. ఒక వేళ హెల్మెట్ లేని పక్షంలో సదరు వాహనాన్ని కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతి ఉండదని చెప్పారు. సమావేశం లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, తిరుపతిరావు, ఆర్డీవో పద్మావతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.