Share News

న్యాక్‌కు సర్వం సిద్ధం చేయాలి

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:18 PM

పాలమూరు యూనివర్సిటీకి వచ్చే నెల 23నుంచి 25 వరకు న్యాక్‌ బృందాల సం దర్శన నేపథ్యంలో పీయూ అధికారులు అందరు న్యాక్‌కు సర్వం సిద్ధం చేయాలని పీయూ వీసీ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌ ఆదేశించారు.

న్యాక్‌కు సర్వం సిద్ధం చేయాలి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళ్లు అర్పిస్తున్న పీయూ వీసీ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీననివాస్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ చెన్నప్ప, అధికారులు

పాలమూరు యూనివర్సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పాలమూరు యూనివర్సిటీకి వచ్చే నెల 23నుంచి 25 వరకు న్యాక్‌ బృందాల సం దర్శన నేపథ్యంలో పీయూ అధికారులు అందరు న్యాక్‌కు సర్వం సిద్ధం చేయాలని పీయూ వీసీ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌ ఆదేశించారు. శనివారం పీయూ ఫార్మసీ ఆడిటోరియంలో నిర్వహించిన న్యాక్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఆర్థికవేత్త,రాజకీయవేత్త మా జీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి పీయూ అధికారులతో కలిసి పూలమాల వేసి నివాళ్లు అ ర్పించారు. ఈ సందర్భంగా పీయూ వీసీ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్‌ సింగ్‌ కృషి మరువ లేనిదని అన్నారు. ఈ సవమావేశంలో భాగంగానే న్యాక్‌ గురించి పీయూ అధికారులకు, అ ధ్యాపకులకు సూచనలు సలహాలు చేశారు. న్యాక్‌ బృం దం సందర్శన పూర్తి అయ్యే వరకు అధికారులు గానీ అధ్యాపకులు గాని ఉద్యోగులు కానీ ఎవ్వరు అత్యవస రం తప్ప సెలవులు తీసుకోకూడదన్నారు. ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, సర్వం సిద్ధం చేయాలని కోరారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ చెన్నప్ప, వీసీ ఓఎస్‌డీ డాక్టర్‌ మదుసూధన్‌ రెడ్డి, అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:18 PM