Share News

ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:19 PM

బడీడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసు కోవాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ అన్నారు.

ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలి
బడిబాట పోస్టర్‌ను విడుదల చేస్తున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, అధికారులు

- మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ

అలంపూరు, జూన్‌ 11 : బడీడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసు కోవాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ అన్నారు. బడి కార్యక్రమంపై అలంపూరులోని మహిళా సమాఖ్య భవనంలో ఎంపీపీ బేగం గోకారి, ఎంపీడీవో అబ్దుల్‌ జబ్బార్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమా వేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, ఉచితంగా రెండు జతల యూనిఫాంలు, మధ్యహ్న భోజనము, పాఠ్య పుస్తకాలతో నోట్‌ పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రు లకు అవగాహన కల్పించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచిం చారు. ఎంఈవో అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను పాఠశాల పునఃప్రారంభం రోజున విద్యార్థులందరికీ వాటిని అందించాలని సూచిం చారు. ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులు బడి మానేయకుండా చూడాలని కోరారు. అనంతరం బడి బాట వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ప్రధానోపాధ్యా యులకు పాఠ్య పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ సరస్వతి, ఏఈ మేఘనాథ్‌, వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంఎన్‌వో బాలాజి కృష్ణకుమార్‌, ఏపీఎం ప్రవీణ, సూపర్‌వైజర్‌ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

‘బడిబాట’ను పకడ్బందీగా నిర్వహించాలి

వడ్డేపల్లి: ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని మునిసిపల్‌ కమిషనర్‌ లక్ష్మీరెడ్డి సంబంధింత అధికారులకు సూచిం చారు. బడి మధ్యలో మానేసిన వారితో పాటు, డ్రాపౌట్‌ అయిన పిల్లలను గుర్తించి బడిలో చేర్చించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం వడ్డేపల్లి ముని పాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు, మెప్మా సిబ్బంది కలిసి తమ పరిధిలోని వార్డుల్లో పాఠశాలలకు వెళ్లని బాలబాలికల వివరాలు సేకరించాలన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణసూరి, కౌన్సిల్‌ సభ్యులు, ఎంపీపీఎస్‌ వడ్డేపల్లి హెడ్‌మాస్టర్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:19 PM