Share News

ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:16 PM

ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకృతి వైద్యుడు డాక్టర్‌ రాంచంద్రారావు అన్నారు.

ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ రాంచంద్రారావు

- ప్రకృతి వైద్యుడు డాక్టర్‌ రాంచంద్రారావు

- ప్రకృతి ఆరోగ్యంపై అవగాహన సదస్సు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, ఆగస్టు 24 : ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకృతి వైద్యుడు డాక్టర్‌ రాంచంద్రారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్రౌన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో గాంధీ గ్లో బల్‌ ఫ్యామిలీ సిద్థార్థ యోగా విద్యాలయం, జిల్లా ప్రైవేట్‌ స్కూల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రకృతి ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగాల నుంచి బయటపడాలంటే మనం తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటుపడ్డవారు వాటిని దూరం చేసుకోవాలన్నారు. బర్గర్లు, కేక్‌లు, చ్లాక్లెట్లు ఇలాంటి ఎన్నో వ్య ర్థ పదార్థాలతో పాటు, మనం తాగే నీరు కలుషితమైనదన్నారు. వీటి వల్ల క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. ప్రతీ ఒక్కరు ప్రకృతి తల్లిని గౌరవించాలన్నారు. ఉప్పు, చక్కెరకు బదులుగా రాగి, కొర్రలు తినాలన్నారు. గ్లోబల్‌ ఫ్యామిలీ చైర్మన్‌ డాక్టర్‌ గున్న రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం కోసం వాకింగ్‌ తప్పనిసరిగా చేయాలని, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నారాయణపేట మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.రామకృష్ణ, డాక్టర్‌ రమేష్‌సరోడే, బెక్కం జనార్ధన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.ప్రభాకర్‌, రవికుమార్‌, అన్సర్‌హుస్సేన్‌, భానుప్రతాప్‌, మల్లికార్జున్‌, అంజిరెడ్డి, సాయబుసేన్‌, శ్రీకాంత్‌ తదితరులున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:16 PM