Share News

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:06 PM

ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
మొక్కనాటి నీరు పోస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- వన మహోత్సవం లక్ష్యాన్ని సాధించాలి

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, జూలై 15 : ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు. భావితరాల మనుగడకు మొక్కలను నాటి పెంచాల్సిన అవసరం ఉన్నదని, పచ్చదనం పెంపొందించడంలో ప్రజలందరూ భాగస్వా ములు కావాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 15 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 2.8 లక్షల మొక్కలను గ్రామాలకు పంపించినట్లు తెలిపారు. అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 35 శాతం మొక్కలు నాటినట్లు తెలిపారు. జులై, ఆగస్టు మాసాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ఈ రెండు నెలల్లో వివిధ శాఖకు కేటాయించిన లక్ష్యాలను సాధించేలా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు తమకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలోచన బాగున్నా, ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవని చెప్పారు. నాటిన ప్రతీ మొక్కను బాధ్యతగా సంరక్షించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసు కోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముసిని వెంకటేశ్వర్లు, నర్సింగరావు, జడ్పీ సీఈవో కాంతమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశిం చారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదు లను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 48 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వాటిని పెండింగ్‌లో ఉంచొద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముసిని వెంకటేశ్వర్లు, నర్సింగరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:06 PM