Share News

ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:09 PM

సార్వత్రిక ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్‌ అన్నారు.

ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటుహక్కు వినియోగంపై ఉండవల్లిలో కూలీలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీపీఎం విలాస్‌రావు

- ఈ నెల 26 నుంచి ఓటర్లకు స్లిప్పుల పంపిణీ : జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌/ ఉండవల్లి/ రాజోలి/ అలంపూర్‌, ఏప్రిల్‌ 25 : సార్వత్రిక ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్‌ అన్నారు. ఓటుహక్కు వినియోగంపై ఉండవల్లి, రాజోలి, అలంపూర్‌లలో అధికారులు గురువారం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 13న లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున, ఈనెల 26వ తేదీ నుంచి జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో పురుషులు 1,25,639 మంది, మహిళలు 1,30,978 మంది, ఇతరులు 11 మంది, మొత్తం 2,56,628 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలంపూర్‌ నియోజకవర్గంలో పురుషులు 1,17,997, మహిళలు 1,21,074, ఇతరులు ఎనిమిది మంది ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఆయా పోలింగ్‌స్టేషన్‌ల పరిధిలో బూత్‌లెవెల్‌ అధికారులు ఓటర్లకు స్లిప్పులు అందిస్తారని కలెక్టర్‌ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

- ఉండవల్లి మండల శివారులోని జాతీయ రహదారి సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో జిల్లా ప్రోగ్రాం అధికారి విలాస్‌రావు మాట్లాడారు. ఎంపీడీవో అబ్దుల్‌ జబ్బార్‌తో కలసి ఓటు హక్కుపై వారికి అవగాహన కల్పించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకొని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఓటు హక్కు వినియోగంపై కూలీలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏపీఎం కోటేశ్వరి, సీసీలు, ఎఫ్‌ఏ, టీఏలు తదితరులు పాల్గొన్నారు.

- ఓటు హక్కు వినియోగంపై రాజోలిలోని పునరావాస కేంద్రంలో ఏపీఎం మార్తమ్మ ఆధ్వర్యంలో ప్రజ లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీసీ మద్దిలేటి, వీఓఏలు రాజేష్‌, సుధీర్‌, హనుమంతు పాల్గొన్నారు.

- ఓటు హక్కు వినియోగంపై విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ అధాకర్‌నాయుడు ఆధ్వర్యంలో అలంపూర్‌లో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు జయంతి, కళావతి, సత్యవతమ్మ, లక్ష్మి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పుల్లన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:09 PM