Share News

రెండేళ్లయినా పూర్తికాలే

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:48 PM

అధు నాతన వసతులతో నిర్మిస్తున్న జిల్లా గ్రంథా లయ సంస్థ నూతన భవనం నిర్మాణ పను లు రెండేళ్లైనా పూర్తి కావడం లేదు.

 రెండేళ్లయినా పూర్తికాలే
నాగర్‌కర్నూల్‌ పట్టణంలో నిర్మాణంలో ఉన్న జిల్లా గ్రంథాలయాల సంస్థ నూతన భవనం

- నత్తకు నడక నేర్పుతున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణం

- పాత భవనంలో ఇబ్బంది పడుతున్న పాఠకులు

- పనులను పూర్తి చేయాలంటున్న స్థానికులు, నిరుద్యోగులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 20: అధు నాతన వసతులతో నిర్మిస్తున్న జిల్లా గ్రంథా లయ సంస్థ నూతన భవనం నిర్మాణ పను లు రెండేళ్లైనా పూర్తి కావడం లేదు. నాగర్‌ కర్నూల్‌ పట్టణంలోని బస్‌డిపో రోడ్డులో పాత వ్యవసాయ గోదాం స్థలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవనం నిర్మా ణానికి రూ.2 కోట్ల నిధులతో 2022 జూన్‌ 18న మాజీమంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కానీ నూతన భవనం నిర్మాణ పను లు నత్తకు నడకనేర్పుతున్నట్లు సాగుతున్నా యని పాఠకులు విస్మయం వ్యక్తం చేస్తున్నా రు. ప్రస్తుతం ఫ్లోరింగ్‌, డోర్లు, కిటికీలు బిగించే పనులతో పాటు కరెంటు వైరింగ్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిర్మాణ పను లకు ప్రారంభించి రెండేళ్ల్లు పూర్తియినా నేటికి అందుబాటులోకి రాకపోవడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంగా మారినా గ్రంథాలయానికి సొంత భవనమే లేకపోవ డం విడ్డూరం. జిల్లా ఏర్పడిన తర్వాత కూడా చాలా కాలంగా అద్దె భవనంలో కొనసాగింది. ప్రస్తుతం పాత మునిసిపాలిటీ భవనంలో నిర్వహిస్తున్నారు. అందులోనూ గదులు ఇరుకుగా ఉండడంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మెప్మా కార్యా లయాన్ని కూడా దానిలోనే నిర్వహిస్తుండ డంతో వారి రాకపోకలు అక్కడి నుంచి కొనసాగిస్తున్నారు. దీంతో పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధు లు స్పందించి గ్రంథాలయం నూతన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందు బాటులోకి తేవాలని పాఠకులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పాత భవనంలో ఇబ్బందిగా ఉంది

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఇంటి వద్ద చదుకోవడం కష్టంగా ఉంటుందని లైబ్రరీకి వెళ్తున్నా. ఇక్కడ కూడా ప్రశాంత వాతావరణం లేదు. మెప్మా ఆఫీసు ఇందులోనే ఉండడంతో వచ్చి పోయే వారి వలన ఏకాగ్రత కోల్పోతున్నా. కంప్యూటర్‌ లాబ్‌ ఉన్నా అందులో కూర్చునేందుకు స్థలం లేదు.

శ్రావణ్‌, పోటీ పరీక్షల అభ్యర్ధి, నాగర్‌కర్నూల్‌

భవనం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

దినపత్రికలు, పుస్తకాలు చదివేందుకు రోజూ గ్రంథాలయానికి వెళ్తాను. ఇరుకైన గదులతో పాటు సరైన వసతులు లేవు. వరండాలోనే కూర్చొని చదువుకుంటున్నా. నూతన భవనం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి.

- రమేష్‌, పాఠకుడు, నాగర్‌కర్నూల్‌

Updated Date - Oct 20 , 2024 | 11:49 PM