Share News

ఇథనాల్‌ కంపెనీని రద్దు చేయాలి

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:04 PM

నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలోని చిత్తనూరు శివారులో ప్రారంభమైన ఇథ నాల్‌ కంపెనీ వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నా యని, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండలంలోని పర్ధీపూర్‌ గ్రామస్థులు దాదాపు 50 మంది మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి చే రుకుని, తహసీల్దార్‌ కృష్ణయ్యకు వినతిపత్రం అందించారు.

ఇథనాల్‌ కంపెనీని రద్దు చేయాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న పర్ధీపూర్‌ గ్రామస్థులు

చిన్నచింతకుంట, జూలై 8 : నారాయణపేట జిల్లా మరికల్‌ మండలంలోని చిత్తనూరు శివారులో ప్రారంభమైన ఇథ నాల్‌ కంపెనీ వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నా యని, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండలంలోని పర్ధీపూర్‌ గ్రామస్థులు దాదాపు 50 మంది మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి చే రుకుని, తహసీల్దార్‌ కృష్ణయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ విషవాయువుల వ్యర్థాలు మన్నెవాగులో కలిస్తే భవిష్యత్‌లో తాగునీరు కూడా పూర్తిగా కలుషితమ య్యే అవకాశం ఉందని, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న కంపెనీని వెంటనే మూసివేయాలంటూ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు వేణు గోపాల్‌, ఆంజనేయులు, వెంకులు, ఖతాల్‌, ఖాదర్‌ తదితరులున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:05 PM