ఎరుకల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:08 PM
ఎరుకల సంఘం జిల్లా కమిటీని ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర నాయకుడు జములయ్య తెలిపారు.

పాలమూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఎరుకల సంఘం జిల్లా కమిటీని ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర నాయకుడు జములయ్య తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా లాల్‌కోట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా వీరన్నపేట కృష్ణ, ఉపాధ్యక్షుడిగా ఎదిర వెంకటేష్, అడ్డాకుల బాలరాజు, నవాబ్‌పేట అంజన్న, బిజిలి మహేష్, శేఖర్, వెంకటేష్, మహిళా సంఘం అధ్యక్షురాలిగా ఎల్లమ్మ, లక్ష్మి, జయమ్మ, భీమమ్మ, యాదయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు జములయ్య మాట్లాడుతూ ఎరుకలు ఐక్యతతో పోరాటం చేయాలన్నారు. ఎరుకల్లో అనేక మంది పేదలు అభివృద్ధికి నోచుకోక వెనుకబడి ఉన్నారని, కనీసం డబుల్ బెడ్ రూం ఇళ్లకు నోచుకోలేదన్నారు. కులవృత్తి సహాకరించకపోవటం, ప్రభుత్వం చేతి వృత్తులకు ప్రోత్సహించక అభివృద్ధికి అమడ దూరంలో ఉన్నారని తెలిపారు.