గోదాముల్లో స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించాలి
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:41 PM
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని గోదాముల్లో స్థానిక కార్మికులకే ఉపాధి అవకాశం కల్పించాల ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మ న్ రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు.

ఎన్‌హెచ్‌పీఎస్ జిల్లా చైర్మన్ రంజిత్‌కుమార్
గద్వాల టౌన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని గోదాముల్లో స్థానిక కార్మికులకే ఉపాధి అవకాశం కల్పించాల ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మ న్ రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. గద్వాల మండలం పూడూరు శివారులో నిర్మించిన గోదా ముల్లో స్థానికులను కాదని ఇతర రాష్ర్టాల కార్మి కులను పనిలో పెట్టుకోవడం సరికాదన్నారు. పని లభిస్తుందన్న నమ్మకంతో సమీప గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు వేల రూపాయలు చెల్లించి సభ్యత్వాలు తీసుకున్నారని, అ లాంటి వారందరితో సమావేశం జరిపి యూని యన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం పట్ట ణంలోని పోరాట సమితి కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ కు మార్ మాట్లాడారు. న్యాయపరంగా అన్నివిధా లా సక్రమమైన పద్ధతిలో నిర్వహిస్తున్న గోదా ములను కొంతమంది రాజకీయ కుట్రతో పను లు జరగకుండా మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. గోదాములు నిర్మిం చి 14ఏళ్లు దాటగా కొంతమంది కుట్రతో న్యాయ స్థానాలను ఆశ్రయించి గోదాములు మూతబడే లా చేశారని, మరోసారి అలాంటి ప్రయత్నాలు జరిగితే స్థానిక కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘట న తప్పదని హెచ్చరించారు. సమావేశంలో సమితి కన్వీనర్ బుచ్చిబాబు, నాయకులు విష్ణు, ప్రేమరాజ్, రంగస్వామి, చిన్నారాముడు, లక్ష్మన్న, సర్వేస్, రమేష్, భూపతి, కార్మికులు బాలరాజు, బాబు, దేవకుమార్, ధోని పాల్గొన్నారు.