Share News

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:21 PM

పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్‌ గ్యాచోభూటియా, ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్‌ రంగస్వామి అన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో వివరాలు తెలుసుకుంటున్న ఎన్నికల పరిశీలకులు

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 30 : పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్‌ గ్యాచోభూటియా, ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్‌ రంగస్వామి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ కంట్రోల్‌ రూమ్‌ సువిధ సీ విజిల్‌, మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ కేంద్రాన్ని, సోషల్‌ మీడియా తదితర విభాగాలను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, అసిస్టెంట్‌ ట్రైని కలెక్టర్‌ గరీమా నరులతో కలిసి తనికీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని మీడియా సర్టిఫికేన్‌ మానిటరింగ్‌ కమిటీ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, సోషల్‌ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనల గుర్తింపు, ఫెయిడ్‌ న్యూస్‌ స్కానింగ్‌, రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తదితర రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం సోషల్‌ మీడియా విభాగాన్ని సందర్శించి సోషల్‌ మీడియా పోస్టింగ్‌ను పరిశీలించారు. సువిధ ద్వారా ఇచ్చే అనుమతులు సీ విజిల్‌ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారం, గ్రీవెన్స్‌లో నమోదైన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రానికి సమీపంలోని దత్త బృందావన్‌ బీఈడీ కాలేజీలో ఏర్పాటు చేసిన రెండు స్ర్టాంగ్‌ రూములను పరిశీలించారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌, స్ర్టాంగ్‌ రూముల వద్ద భద్రత ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుమోహన్‌, నారాయణపేట, మక్తల్‌, తహసీల్దార్లు రాణా ప్రతాప్‌, సువర్ణ రాజు, డీపీఆర్వో రషీద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:21 PM