Share News

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - May 12 , 2024 | 11:08 PM

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ సంఘం అధ్యక్షుడు గోపాలం అన్నారు.

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
పెన్షనర్లను సన్మానిస్తున్న ఆ సంఘం నాయకులు

మక్తల్‌, మే 12 : పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ సంఘం అధ్యక్షుడు గోపాలం అన్నారు. ఆదివారం పట్టణంలోని అక్షర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మక్తల్‌ పెన్షనర్ల సంఘంలో 450 మంది సభ్యులు ఉన్నారని, ప్రతీ నెలా సమావేశం నిర్వహించుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తక్షణమే పెన్షనర్లకు 300 గజాల స్థలం కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు సహకారంతో పెన్షనర్ల సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పెన్షనర్లకు రావాల్సిన నాలుగు డీఏలు, నూతన పీఆర్సీలను వెంటనే ప్రకటించి నగదు రూపంలో చెల్లించాలన్నారు. నగదు రహిత వైద్యసేవలను ఉచితంగా ప్రభుత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెన్షనర్లు అయిన విద్యావతి, దేవేంద్రప్ప పుట్టిన రోజు సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ సూర్యప్రకాష్‌, పెన్షనర్ల సంఘం గౌవవాధ్యక్షుడు సంజన్న, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, కోశాధికారి సిద్ధిలింగయ్య, సుజాత, విద్యావతి, మల్లికార్జున్‌, తులిశప్ప, నర్సమ్మ, గోవిందు, రాములు, జగదీష్‌, రాంచందర్‌, దేవణ్ణ, ఖాదర్‌భాష, తిప్పారెడ్డి, నారాయణరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 11:08 PM