Share News

పర్యావరణ పరిరక్షణకు కృషి

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:09 PM

పర్యావరణ పరిరక్షణకు అధిక సంఖ్య లో మొక్కలను నాటాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి
గద్వాల కొత్త హౌసింగ్‌ బోర్డు కాలనీలో మొక్కలు నాటిన కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

గద్వాల న్యూటౌన్‌/ గద్వాల టౌన్‌/ గట్టు/ ఉండవల్లి/ అలంపూర్‌/ రాజోలి/ మానవపాడు, జూన్‌ 5 : పర్యావరణ పరిరక్షణకు అధిక సంఖ్య లో మొక్కలను నాటాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. ప్రపంచ పర్యా వరణ దినోత్సవాన్ని బుధవారం జిల్లా వ్యా ప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలోని పార్క్‌లో కలెక్టర్‌ బీఎం సంతోష్‌ మొక్క నాటి నీరు పోశా రు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ శంకర్‌సింగ్‌, ఇంజనీర్లు నితీశ్‌రెడ్డి, ప్రహర్ణి, కృష్ణ, మెప్మా సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

- గద్వాలలోని మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల ఆవరణలో ఇన్‌ చార్జి ప్రిన్సిపాల్‌ హరిబాబు, అధ్యాపకులు, విద్యా ర్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధ్యా పకులు మేడిచర్ల హరి నాగభూషణం, శ్రీనివాస్‌, వినోద్‌, ఎల్ల స్వామి, సురేష్‌, సుబ్రమణ్యం, మాధవి, సుజాత, జీవేంద్రుడు పాల్గొన్నారు.

- గద్వాల పట్టణంలోని సత్యసాయి డిగ్రీ కళా శాల వద్ద అటవీశాఖ జిల్లా సెక్షన్‌ అధికారి అబ్దు ల్‌ వాజిద్‌ మొక్కలు నాటారు. అనంతరం పట్ట ణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాది వరలక్ష్మి, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గిరిబాబు, కళాశాల కరస్పాండెంట్‌ మాకం బీచు పల్లి, చిత్రకళాకారుడు డి.శ్రీనివాసులు, ఆనంద్‌, వినయ్‌, సురేష్‌ పాల్గొన్నారు.

- జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.కుష మొక్కలు నాటారు. అనం తరం అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి గంట కవితాదేవి, మొదటి అద నపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి డి.ఉద య్‌నాయక్‌, గద్వాల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు రఘురామ్‌రెడ్డి, కార్యదర్శి ఖాజామొయినుద్దీన్‌, న్యాయవాదులు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు త్రిపాఠి, ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు.

- జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఆవరణలో ఎస్పీ రితిరాజ్‌ మొక్క నాటి నీరు పోశారు. కార్య క్రమంలో సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, ఆర్‌ఐ వెంకటేష్‌, సీఐ భీంకుమార్‌ పాల్గొన్నారు.

- గట్టు మండల పరిధిలోని ఎల్లందొడ్డిలో ఇన్‌చార్జి ఎంపీడీవో చెన్నయ్య మొక్కలు నాటారు. కార్యక్రమంలో నీతి అయోగ్‌ కోఅర్డినేటర్‌ అబ్దుల్‌ ఫజల్‌, ఏపీవో స్వామి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మాచర్లలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్‌ జిల్లా కోఅర్డినేటర్‌ నర్సింహులు ఆధ్వర్యంలో బస్టాండ్‌ నుంచి ఎస్సీ కాలనీ వరకు ర్యాలీ నిర్వహించారు.

- ఉండవల్లి మండల కేంద్ర శివారులో ఎంపీవో పద్మావతి ఏపీవో సుజాత, కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, టీఏ రామచంద్రుడు మొక్కలు నాటారు. డీ బూడిదపాడు ప్రధాన రహదారికి ఇరువైపులా 260 మొక్కలను నాటినట్లు ఏపీవో తెలిపారు.

- అలంపూర్‌ మండల పరిధిలోని భీమవరం, క్యాతూరు గ్రామాల్లో ఎంపీడీవో జబ్బార్‌ ఆధ్వ ర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీవో రాజు, క్యాతూరు పంచాయతీ కార్యదర్శి దేవకీ దేవి, టీఏ మల్లికార్జున్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

- రాజోలి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేకాధికారి, ఎంపీవో ఖాజాయొ హిద్దీన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. తూర్పు గార్లపాడులోని రైతువేదిక ఆవరణలో పంచా యతీ కార్యదర్శి నారాయణమ్మ మొక్కలు నాటా రు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్‌ కుమార్‌, వెంకటేశ్వర్లు, జయన్న, తూర్పు గార్ల పాడులో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ జమ్మన్న, సతీష్‌, సిబ్బంది మద్దిలేటి, రమేష్‌, శంకర్‌ పాల్గొన్నారు.

- మానవపాడు మండలంలోని పెద్ద ఆముదాల పాడులో రహదారికి ఇరువైపులా ఎంపీడీవో ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏపీవో విజయశంకర్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, చెన్న కేశవులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 11:09 PM