గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
ABN , Publish Date - Jan 18 , 2024 | 10:56 PM
గ్రామీణ అభివృద్ధిలో ఎంపీడీవోలు, ఎంపీవోల పాత్ర కీలకమని, వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- ఎంపీడీవోలు, ఎంపీవోల పాత్ర కీలకం
- సమీక్షా సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, జనవరి 18 : గ్రామీణ అభివృద్ధిలో ఎంపీడీవోలు, ఎంపీవోల పాత్ర కీలకమని, వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సము దాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నిర్వహిం చిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని మండ లాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు చేస్తున్న పనులపై ఆరా తీశారు. మండల పరిషత్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న పనుల గురించి ఎంపీడీవోలు ఆయనకు వివరించారు. డీఆర్‌డీఏ, డీపీవో పరిధిలో చేస్తున్న పనుల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ పంచాయితీల్లో ప్రతీ సమస్యకు తక్షణమే స్పందించేలా మండల అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ పనులు, ఇంటి పన్నుల వసూలు సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 15 రోజులకు ఒకసారి పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టరు అపూర్వచౌహాన్, డీఆర్ డీఏ కాంతమ్మ, డీపీవో శ్యాంసుందర్, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
పనుల పురోగతిపై దృష్టి సారించాలి
జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై దృష్టి సారించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచిం చారు. అధికారులందరూ సమష్టిగా కృషి చేసి, పనులు పూర్తి చేయాలని చెప్పారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖల వారీగా చేయాల్సిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సన్మానించిన విశ్రాంత ఉద్యోగులు
కలెక్టర్ బీఎం సంతోష్‌ను గురువారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఐడీవోసీ కార్యాలయంలో వారు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, కార్యదర్శి కృష్ణారెడ్డి, బాలకిషన్‌రావు, వెంకటరమణ, వెంకట్రాములు, హనుమంతు పాల్గొన్నారు.