Share News

ఎండీసీఏ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - May 20 , 2024 | 11:05 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సహకారంతో మహబూబ్‌నగర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను అభివృద్ధి చేసేం దుకు తన వంతు కృషి చేస్తానని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఎండీసీఏ అభివృద్ధికి కృషి
ఎండీసీఏ ప్రతినిధులు, కోచ్‌లతో ఎమ్మెల్యే

- క్రికెట్‌లో జిల్లా క్రీడాకారులు రంజీకి ఎదగాలి

- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, మే 20 : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సహకారంతో మహబూబ్‌నగర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ను అభివృద్ధి చేసేం దుకు తన వంతు కృషి చేస్తానని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమ వారం బోయపల్లి సమీపంలో గల ఎండీసీఏ మైదా నంలో జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరం ముగింపు కార్య క్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మునిసి పల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరికొంత భూమిని కొనుగోలు చేస్తే స్టేడియం అభివృద్ధి చేసేందుకు బీసీసీఐ ప్రతినిధుల దృష్టికి తీసుక వెళ్తానని అన్నారు. స్టేడియం అభివృద్ధిలో ఎండీసీఏ కృషి ఎంతో ఉందని, గతంలో ఎన్నడు లేని విధంగా హెచ్‌సీఏ మహబూబ్‌నగర్‌లో ఆరు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమ న్నారు. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, ఇటీవలే జిల్లా క్రీడాకారుడు రంజీకి ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ చాలామంది పిల్లలు క్రికెట్‌ అంటే ఇష్టపడుతారని, జిల్లా క్రీడాకా రులు క్రికెట్‌లో రాణించాలన్నారు. క్రీడాకారులకు తనవంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా క్రికెట్‌ సంఘం ప్రతినిధుల కృషి, హెచ్‌ సీఏ సహకారంతో ఉమ్మడి జిల్లాలో వేసవి శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషంగా ఉం దన్నారు. క్రికెట్‌ సంఘం జిల్లా సెక్రటరీ రాజశేఖర్‌ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, కోస్గి, గద్వాల, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌లలో నిష్ణాతులైన కోచ్‌ల పర్యవేక్షణలో వేసవి శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జట్లుగా ఎంపిక చేసి మ్యాచ్‌లు నిర్వహిస్తామన్నారు. ఇందులోనూ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో క్రికెట్‌ సంఘం జిల్లా ప్రతినిధులు సురేష్‌కుమార్‌, అశోక్‌, రాజేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్‌, నాయకులు చంద్రకుమార్‌గౌడ్‌, పాపరాయుడు, కౌన్సిలర్లు మోతీలాల్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

హాకీ క్రీడాకారిణి జ్యోతిరెడ్డికి అభినందన

భారత హాకీ జట్టులో తొలిసారి తెలంగాణ మహిళా జట్టుకు రాష్ట్ర క్రీడాకారిణి జ్యోతిరెడ్డి ఎంపికైంది. ఆదివారం రాత్రి ఉప్పల్‌ స్టేడియంలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆమెను అభినందించారు. హాకీ టోర్నీలో రాణించి భారత జట్టు విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, చాముండేశ్వరినాథ్‌, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సినీ దర్శకుడు వంశీ ఉన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:05 PM