Share News

రూ.100 కోట్లతో దేవాలయ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:39 PM

మండలంలోని సిర్సనగండ్ల సీతా రామచంద్రస్వామి దేవాలయాన్ని శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ పరిశీలించారు.

 రూ.100 కోట్లతో దేవాలయ అభివృద్ధికి కృషి
సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

చారకొండ, పిబ్రవరి 2: మండలంలోని సిర్సనగండ్ల సీతా రామచంద్రస్వామి దేవాలయాన్ని శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ పరిశీలించారు. ఆల యంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ ఢేరం రామశర్మతో కలిసి ఎమ్మెల్యే ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ చ్చే బ్రహ్మోత్సవాలలోపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు క లుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సహకారంతో రూ. 100 కోట్లతో ఆలయ అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తున్న ట్లు తెలిపారు. తహసీల్దార్‌ కేసీ ప్రమీల, ఆలయ ఈవో మల్లెల రఘు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికిం ది బాల్‌రాంగౌడ్‌, మండ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ నాగేంద్ర, సిం గిల్‌విండో డైరక్టర్‌ జగన్‌మోహన్‌, నాయకులు సందిప్‌రెడ్డి, శంకర్‌గౌ డ్‌, లక్ష్మయ్యగౌడ్‌, జేసీబీ వెంకటయ్యగౌడ్‌, గజ్జే కొండల్‌గౌడ్‌, సహ దేవ్‌, కుకుడాల శ్రీనివాసులు. శివ, దశరథం, ఆది. వెంకట్‌రెడ్డి, న ర్సింహరెడ్డి, పూల్‌సింగ్‌, నర్సింహచారి, తిరుమలేష్‌, ఆలయ అర్చకు లు ఢేరం మురళీధర్‌శర్మ, ఢేరం వేణుశర్మ తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

అచ్చంపేట: నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా సమస్య తలెత్తకుండా ప్రత్యేక అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారులు ప్రజలకు వారఽధిగా అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేలా కృషి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రతిపక్ష పార్టీకి ఇంకా మేమే అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నారని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఎంపీపీ శాంతాబాయి, వైస్‌ ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ సభ్యుడు మత్రునాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 10:39 PM