Share News

చెడుపై మంచి విజయమే దసరా

ABN , Publish Date - Oct 11 , 2024 | 11:30 PM

జిల్లాలో దసరా సందడి నెలకొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు.

చెడుపై మంచి విజయమే దసరా

- నేడు శమీ వృక్షానికి పూజలు.. రావణ దహనం

- పేటలో బారంబావి వద్ద ఏర్పాట్లు చేసిన అధికారులు

నారాయణపేట, అక్టోబరు 11 : జిల్లాలో దసరా సందడి నెలకొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. జిల్లా వ్యాప్తంగా వీహెచ్‌పీ, ఆర్యసమాజం, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు వివిధ సంఘాల ఆధ్వ ర్యంలో దసరా వేడుకలు నిర్వహిస్తారు. శనివారం పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానం, బారంబా వి వద్ద వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో కాషా య జెండాలతో సాయంత్రం ఆర్యసమాజం నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుంది. మహంకాళి మందిరం నుంచి వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో దేవీపూజ, శమీపూజ నిర్వహించిన అనంతరం ర్యాలీ ముందుకుసాగుతుంది. పురవీధుల గుండా బారంబావి వద్దకు ర్యాలీగా చేరుకొని, రావణ దహన కార్యక్ర మం నిర్వహించనున్నారు. అనంతరం శమీపత్రం ఒకరికిఒకరు ఇచ్చి, పుచ్చుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుం టారు. పండుగ సందర్భంగా కొనుగోలు దారులతో వ్యాపార దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

Updated Date - Oct 11 , 2024 | 11:30 PM