Share News

ఇంటింటికీ చుక్కల మందు పంపిణీ

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:47 PM

మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం మాగనూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ విరోజా ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేశారు.

ఇంటింటికీ చుక్కల మందు పంపిణీ
ఇటుక బట్టీల వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న డాక్టర్‌ విరోజా

మాగనూరు, మార్చి 4 : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం మాగనూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ విరోజా ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళవారం కూడా మిగిలిన చిన్నారులకు ఇంటింటికీ తిరిగి వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల పంపిణీ చేస్తారన్నారు. మండలంలో మొత్తం 10,301 చిన్నారులు ఉన్నారని తెలిపారు.

కోస్గి రూరల్‌ : పల్స్‌ పోలియో కార్యక్ర మాన్ని రాష్ట మానిటరింగ్‌ అధికారి వినయ్‌సింగ్‌, డీఐవో శైలజ మండలంలోని గుండుమాల్‌ గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు వైద్య సిబ్బంది ప్రతీ ఇంటికి తిరిగి పోలియో చుక్కలు వేయాలన్నారు. కార్యక్రమం లో డాక్టర్‌ కిష్టమ్మ, వైద్యసిబ్బంది ఉన్నారు.

దామరగిద్ద : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం దామరగిద్డ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ స్ఫూర్తి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి పోలయో చుక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ మండలంలో 95 శాతం పోలియో చుక్కలు వేయడం పూర్తి అయినట్లు తెలిపారు. మంగళవారం కూడా మిగిలిన చిన్నారులకు ఇంటింటికీ తిరిగి వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల ద్వారా చుక్కల మందు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మండలంలో మొత్తం 6,666 చిన్నారులకు గాను 5,900 మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 10:47 PM