Share News

విశ్రమించొద్దు

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:10 PM

లక్ష్యసాధనలో ఎవరూ విశ్రమించకూడదని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

  విశ్రమించొద్దు
కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ బీఎం సంతోష్‌, అధికారులు

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- ఘనంగా ఉపాధి హామీ వార్షికోత్సవం

- జిల్లా వ్యాప్తంగా వేడుకలు

- కూలీలతో కలిసి కేక్‌ కట్‌ చేసిన అధికారులు

గద్వాల న్యూటౌన్‌, ఫిబ్రవరి 2 : లక్ష్యసాధనలో ఎవరూ విశ్రమించకూడదని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్ర వారం జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అధికారులు కూలీలతో కలిసి కేక్‌ కట్‌ చేసి, వారిని ఘనంగా సన్మానించారు. గద్వాల పట్టణంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టరేట్‌లో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్‌ కట్‌ చేసి ఉపాధి హామీ సిబ్బందికి, కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అత్యధిక దినాలు పని చేసిన గద్వాల మండలానికి చెందిన దుబ్బన్న, గోపాల్‌, రాజులను ఘనంగా సన్మానించారు. సిబ్బంది సహకారంతో జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తామని డీఆర్‌డీఏ ఉమాదేవి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్‌, చీర్ల శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో కాంతమ్మ, అదనపు డీఆర్‌డీవో నాగేంద్రం, డీపీవో శ్యాంసుందర్‌, ఏవో సిద్ధయ్య, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

పేదరికం నిర్మూలనకు ఉపాధి హామీ

గద్వాల : పేదరిక నిర్మూలన జరిగే వరకు ఉపాధి హామీ పథకం కొనసాగుతుందని డీఆర్‌డీవో ఉమాదేవి అన్నారు. ఉపాధి హామీ పథకం ఏర్పడి 19 ఏళ్లు అయిన సందర్భంగా మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కూలీలకు మిఠాయిలు తినిపిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నయ్య, ఏపీవో శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి భారతి, టెన్నికల్‌ అసిస్టెంట్‌ సునిత, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

వేలాది మందికి లబ్ధి

ఉండవల్లి : ఉపాధి హామీ పథకం ద్వారా వేలాది మంది కూలీలు, రైతులకు లబ్ధి చేకూరుతోందని అదనపు డీఆర్‌డీవో నాగేంద్రం అన్నారు. ఉపాధి హామీ పథకం వార్షికోత్సవాన్ని శుక్రవారం మండల కేంద్రంతో పాటు బస్వాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీవో విజయ శంకర్‌, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఏలు, టీఏలు పాల్గొన్నారు.

రాజోలి : మండల కేంద్రమైన రాజోలిలో నిర్వహిం చిన ఉపాధి హామీ పథకం వార్షికోత్సవంలో ఎంపీడీవో గోవింద్‌రావు పాల్గొన్నారు. 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కూలీలను పంచాయతీ కార్యాదర్శి కృష్ణయ్యతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో టీఏలు ప్రభాకర్‌, మమత, కృష్ణయ్య పాల్గొన్నారు.

మానవపాడు : మండల కేంద్రం నుంచి గోకులపాడు గ్రామానికి వెళ్లే దారిలో పనులు చేస్తున్న కూలీల్లో వంద రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్న వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమణారావు, ఎంఈవో శివప్రసాద్‌, సూపరింటెండెంట్‌ రామకృష్ణ, ఏపీవో లాలునాయక్‌, పంచాయతీ కార్యదర్శి మహేష్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కేటీదొడ్డి : మండలంలోని కొండాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎంపీడీవో మహ్మద్‌ అజహర్‌మొయిద్దీన్‌ పరిశీలించారు. కూలీలను సన్మానించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందితో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

గట్టు : మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో వ్యవసాయ ఉత్పత్తిదారుల యూనియన్‌, తెలంగాణ సర్వీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.నర్సింహులు, లావణ్య, హెచ్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అయిజ : పట్టణంలో ఎంపీడీవో సాయిప్రకాష్‌ కూలీలతో కలిసి కేక్‌ కట్‌చేశారు. వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న వారిని ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో ఎంపీవో నర్సింహారెడ్డి, ఏపీవో శరత్‌, మాజీ ఎంపీపీ సుందర్‌రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:10 PM