Share News

ప్రలోభాలకు గురి కావొద్దు

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:41 PM

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలని ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌) డీఐజీ సురేందర్‌ కత్రి, ఎస్పీ రితిరాజ్‌ అన్నారు.

ప్రలోభాలకు గురి కావొద్దు
సమీక్షా సమావేశంలో ఐటీబీపీ డీఐజీ సురేందర్‌ కత్రి

- ఐటీబీపీ బలగాల డీఐజీ సురేందర్‌ కత్రి, ఎస్పీ రితిరాజ్‌

గద్వాల క్రైం, ఏప్రిల్‌ 5 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలని ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌) డీఐజీ సురేందర్‌ కత్రి, ఎస్పీ రితిరాజ్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణ, పోలీసు, ఐటీబీసీ ఫోర్స్‌ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని ఎస్పీ చాంబర్‌లో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నగదు, మద్యం రవాణా నియంత్రణకు చర్యలపై సమీక్షించారు. కేంద్ర బలగాల కవాతు, వాహనాల తనిఖీలు, జిల్లాకు వచ్చే కేంద్ర బలగాలకు అవసరమైన వసతులు కల్పించడంపై చర్చించారు. సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ గుణశేఖర్‌, ఐటీబీపీ కమాండెంట్‌ ఎస్‌పీ జోషి, డిప్యూటీ కమాండెంట్‌ బీఎస్‌ రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ, సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:41 PM