Share News

రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:33 PM

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

 రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య
దొడ్డి కొమరయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు.

సరైన నివేదిక ఇవ్వాలి.

జిల్లాలో గతంలో గుర్తించిన ఇసుక రీచ్‌లను జిల్లా స్థాయి కమిటీ సభ్యులు మరోసారి సందర్శించి సరైన ని వేదికలను ఇవ్వాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అధికారు లను ఆదేశించారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కలె క్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి అధికారుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా అవసరాలకై గతంలో గుర్తించిన ఇసుక రీచ్‌లను పునఃసందర్శించి పూర్తిస్థాయి నివేదికలను అందజేయా లని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జి ల్లాలో ఉన్న రీచ్‌ల లోటుపాట్లు తదితర వివరాలను అ ఽధికారులతో అడిగి తెలుసుకున్నారు. మైన్స్‌ ఏడీ రవీం దర్‌, జిల్లా భూగర్భ జిల్లా అధికారిణి రమాదేవి, ఆర్‌ డబ్ల్యూఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ముర ళి, డీపీవో కృష్ణ, టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు ఆఫీసర్‌ రాంప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాములు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లోని కార్యాలయాల పరిశీలన

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ గురువా రం సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయంలో మొదటి, రెండవ అంత స్తులో గల వివిధ ప్రభుత్వ శాఖల కా ర్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కొ శాఖ వారీగా అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించా రు. నిర్దేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మా త్రమే హాజరవ్వడంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్‌ రేపటి నుంచి అందరూ ఉద్యోగులు సమయానికి హాజర వ్వాలని ఆదేశించారు. అనధికారికంగా కార్యాలయాలకు సిబ్బంది గైర్హాజరై తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - Jul 04 , 2024 | 11:33 PM