ఫిర్యాదు చేయకుండా ధర్నాలు చేస్తారా.?
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:01 PM
జడ్చర్ల మునిసిపాలిటీ బాదేపల్లి పాత బజారు సమీపంలోని రంగనాయ కుల గుట్టపై ఉన్న శ్రీరంగనాయక స్వామి దేవాలయం ముందున్న కోనేరు పూడ్చివేసిన వ్యక్తిపై పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా ధర్నాలు చేయడం, జడ్చర్ల బంద్ కు పిలుపునివ్వడం న్యాయమేనా అని జడ్చర్ల బంద్‌కు పిలుపు నిచ్చిన వారిని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు.

- కులం, మతంపై రాజకీయాలు చేసే వారిని పట్టణ ప్రజలు నమ్మొద్దు
- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల, జూలై 8 : జడ్చర్ల మునిసిపాలిటీ బాదేపల్లి పాత బజారు సమీపంలోని రంగనాయ కుల గుట్టపై ఉన్న శ్రీరంగనాయక స్వామి దేవాలయం ముందున్న కోనేరు పూడ్చివేసిన వ్యక్తిపై పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా ధర్నాలు చేయడం, జడ్చర్ల బంద్ కు పిలుపునివ్వడం న్యాయమేనా అని జడ్చర్ల బంద్‌కు పిలుపు నిచ్చిన వారిని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవాలయ భూము లను కాపాడాలంటూ పోరాటం చేస్తున్న అనిల్‌కుమార్ అనే వ్య క్తితో మాట్లాడి, కోనేరును పూడ్చి న రవితేజగౌడ్‌పై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించానని, పో లీసులు అతన్ని రిమాండ్‌కు తర లించారని వివరించారు. జరిగిన సంఘటనపై తాను స్పందించినా ఎమ్మెల్యే స్పందించలేదంటూ తనపై సోషల్‌మీడియాలో ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగనాయకస్వామి దేవాలయం అర్చక, మేనేజింగ్ ట్రస్టీగా రౌడీషీటర్, మర్డర్ కేసు ఉన్న రవితేజగౌడ్ అనే వ్యక్తికి 2019లో నియామ కానికి సహకరించింది ఎవరని, ధర్నాలు చేసిన వా రంతా నాడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. కులం, మతంపై రాజకీయాలు చేసే వారిని పట్టణ ప్రజలు నమ్మొద్దని కోరారు. బంద్‌కు పిలుపునివ్వ డంతో విద్యార్థులు, వ్యాపారులు ఇబ్బందులకు గుర య్యారన్నారు. దేవుడిపై రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. అంతకుముందు రంగనాయక స్వామి దేవాలయం ముందు కోనేరును పూడ్చిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
జడ్చర్ల బంద్ ప్రశాంతం
జడ్చర్ల : జడ్చర్ల మునిసిపాలిటీ, బాదేపల్లి పాతబజారు సమీపంలోని రంగనాయకుల గుట్టపై ఉన్న రంగనాయకస్వామి దేవాల యం ముందున్న కోనేరును పూడ్చిన సంఘ టనపై దేవాలయ పరిరక్షణ కమిటీ పిలుపు నిచ్చిన జడ్చర్ల బంద్ సోమవారం ప్రశాం తంగా జరిగింది. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్వచ్చం దంగా సెలవు ప్రకటించారు. అదేవిధంగా, పట్టణంలోని దుకాణాలను స్వచ్చందంగా మూసివేశారు. దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పాతబజారు హనుమాన్ దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తా వద్ద కొద్దిసేపు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు బాలవర్దన్‌గౌడ్, రంజిత్‌బాబు, ఫణిరాజ్‌గౌడ్, శ్రీకాంత్, అంజిబాబు, శ్రీనివాస్‌యాదవ్, ఈటెశ్రీను, సంతోష్‌చారి, సూరి, నర్సిములుతో పాటు హిందూ ధార్మిక సంఘాల నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.